PM Modi's conversation with Lakhpati Didis in Jalgaon, Maharashtra

August 26th, 01:46 pm

PM Modi had an enriching interaction with Lakhpati Didis in Jalgaon, Maharashtra. The women, who are associated with various self-help groups shared their life journeys and how the Lakhpati Didi initiative is transforming their lives.

మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 25th, 01:00 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఈ ప్రాంతానికి చెందిన నా తోటి మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు, ఈ ప్రాంత ఆడబిడ్డ రక్షా ఖడ్సే గారు. ఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన తల్లులు, సోదరీమణులు... నా కళ్ళు చూడగలిగినంతవరకు ఇక్కడ మాతృమూర్తుల సముద్రం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం మనసుకు ఎంతో హాయినిస్తోంది.

మ‌హారాష్ట్ర‌, జ‌ల‌గావ్‌లో నిర్వ‌హించిన‌ ల‌క్షాధికార సోద‌రీమ‌ణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

August 25th, 12:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్‌గావ్‌లో నిర్వ‌హించిన ల‌ఖ్ ప‌తి దీదీ స‌మ్మేళ‌న్ (ల‌క్షాధికార సోద‌రీమ‌ణుల స‌మావేశం)లో పాల్గొన్నారు. మూడో ప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఇటీవ‌ల ల‌క్షాధికారులైన 11 ల‌క్ష‌ల‌మంది సోద‌రీమ‌ణుల‌కు ధ్రువ‌ ప‌త్రాల‌ను అందించి స‌త్క‌రించింది.

కొల్హాపూర్ స్మార‌కాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన‌మంత్రి

August 21st, 11:56 pm

వార్సాలోని కొల్హాపూర్ స్మారకం వ‌ద్ద బుధ‌వారం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళుల‌ర్పించారు.

పోలెండ్ లోని వార్సాలో కొల్హాపుర్ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి

August 21st, 10:31 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోలెండ్ లోని వార్సాలో గల కొల్హాపుర్ స్మారకానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ స్మారకం కొల్హాపుర్ కు చెందిన మహనీయ రాజకుటుంబానికి ఒక నివాళిగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో భయానక స్థితిగతుల కారణంగా ఆశ్రయాన్ని కోల్పోయిన పోలెండుకు చెందిన మహిళలకు, బాలలకు తలదాచుకొనే నీడను ఇవ్వడంలో ఈ రాజకుటుంబం అగ్ర స్థానాన నిలిచింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.