త్రిపురలోని ఖోవై-హరీనా రహదారి 135 కి.మీ. మేర అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదం

December 27th, 08:36 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జాతీయ రహదారి-208ని 101.300 కి.మీ. (ఖోవాయి) నుండి 236.213 కి.మీ. (హరీనా) వరకు రెండు లేన్‌ల మేర అభివృద్ధి & విస్తరణకు ఆమోదం తెలిపింది. త్రిపుర రాష్ట్రంలో దీని మొత్తం పొడవు 134.913 కి.మీ. ఈ మొత్తం ప్రాజెక్ట్ రూ.2,486.78 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నారు. ఇందులో రూ.1,511.70 కోట్ల రుణ భాగం (జేపీవై 23,129 మిలియన్లు) ఉంది. లోన్ అసిస్టెంట్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి అధికారిక అభివృద్ధి సహాయం (ఓడా) పథకం కింద ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ త్రిపురలోని వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన రహదారి కనెక్టివిటీని సులభతరం చేయడానికి మరియు త్రిపుర నుండి అస్సాం మరియు మేఘాలయాలకు ప్రస్తుత ఎన్.హెచ్-8 కాకుండా ప్రత్యామ్నాయ యాక్సెస్‌ను అందించడానికి ఉద్దేశించబడింది.