2024-25 మార్కెటింగ్ కాలానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

June 19th, 09:14 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2024-25 మార్కెటింగ్ కాలానికి అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పి) పెంచడానికి ఆమోదం తెలిపింది.

ఖరీఫ్ సీజన్, 2024 (01.04.2024 నుండి 30.09.2024 వరకు) ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల కు పోషకాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిసి)రేటుల కు, మూడు క్రొత్త ఫెర్టిలైజర్ గ్రేడుల ను ఎన్‌బిఎస్ పథకం లో చేర్చడానికి ఆమోదాన్నితెలిపిన మంత్రిమండలి

February 29th, 04:28 pm

ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల కు ఖరీఫ్ సీజను, 2024 (01.04.2024 నుండి 30.09.2024 వరకు) పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) రేటుల ను ఖరారు చేయడాని కి సంబంధించి ఎరువుల విభాగం తీసుకు వచ్చిన ప్రతిపాదన ను, మూడు క్రొత్త గ్రేడులకు చెందిన ఎరువుల ను ఎన్‌బిఎస్ పథకం లో చేర్చడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఖరీఫ్ సీజను 2024 కు గాను రమారమి 24,420 కోట్ల రూపాయలు తాత్కాలిక బడ్జెటు రూపేణా అవసరం అవుతాయి.

కనీస మద్దతు ధరల పెంపుపై రైతుల హర్షం... ప్రధానమంత్రి సంతృప్తి

June 09th, 08:33 pm

కనీస మద్దతు ధరల పెంపుపై అన్నదాతల హర్షం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. ప్రభుత్వం మరింత ఉత్తేజంతో పనిచేయడానికి ఇదెంతో స్ఫూర్తినిస్తుందని ఆయన అభివర్ణించారు.

2023-24 మార్కెటింగ్ సీజన్ కి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర కాబినెట్ ఆమోదం

June 07th, 05:35 pm

ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం 2023-2024 మార్కెటింగ్ సీజన్ కు గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలియజేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గ్లోబ ల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 లో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం...

February 10th, 11:01 am

ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీమంతి ఆనందిబెన్‌ పటేల్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యజి, బ్రజేష్‌ పాఠక్‌ జి, కేంద్ర కేబినెట్‌లో నా సీనియర్‌ సహచరులు, లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ జీ, వివిధ దేశాలనుంచి విచ్చేసిన ఘనతవహించిన ప్రతినిధులకు, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన మంత్రులు అందరికీ, పరిశ్రమ వర్గాలకు చెందినవారికి, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమాజానికి, విధాన నిర్ణేతలు, కార్పొరేట్‌ నేతలు, ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హాజరైన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ముఖ్య అతిథిగా ఉంటూ మీ అందరికీ స్వాగతం పలికే బాధ్యతను నేను ఎందుకు తీసుకున్నానని మీ అందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, నాకు ఇక్కడ అదనపు బాధ్యత కూడా ఉంది. మీరందరూ నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే నేను ఉత్తరప్రదేశ్‌ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నాకు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్‌ ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత కూడా ఉంది. ఇవాళ నేను ఆ బాధ్యతను పూర్తి చేసేందుకు నేను ఇందులో భాగస్వామినయ్యాను. అందువల్ల భారతదేశం వివిధ ప్రాంతాలనుంచి అలాగే విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్‌ కు విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను.

ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ

February 10th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్‌ ట్రేడ్‌ షోను, ఇన్వెస్ట్‌ యుపి 2.0ను ప్రధానమంత్రి ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 అనేది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌. దీని ద్వారా విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, అకడమిక్‌ రంగానికి చెందిన వారు, ప్రపంచవ్యాప్తంగా గల మేధావులు, నాయకులు, వ్యాపార అవకాశాలపై సమిష్టిగా చర్చించి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటారు.ఈ సమ్మేళనం సందర్భగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి స్వయంగా తిలకించారు.

CCEA approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2022-23

June 08th, 05:30 pm

CCEA chaired by PM Modi has approved increase in MSP for all mandated Kharif Crops for Marketing Season 2022-23. This has been done to ensure remunerative prices to the growers for their produce and to encourage crop persification.

చత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ప్రత్యేక లక్షణాలు గ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్రసంగ పాఠం

September 28th, 11:01 am

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్ జీ, కేబినెట్‌లో నా ఇతర సహచరులు శ్రీ పురుషోత్తం రూపాల జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, సోదరి శోభా జీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ ధరమ్ లాల్ కౌశిక్ జీ, వ్యవసాయ విద్యతో సంబంధం ఉన్న విసిలు, డైరెక్టర్లు, శాస్త్రీయ సహచరులు మరియు నా ప్రియమైన రైతు సోదరీమణులు మరియు సోదరులు!

ప్రత్యేక లక్షణాలుగ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

September 28th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు గ‌ల 35 పంట ర‌కాల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి, రాయ్‌పూర్‌లో నూత‌నంగా నిర్మించిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్య‌ట్ ఆఫ్ బ‌యోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను దేశానికి అంకితం చేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల‌కు గ్రీన్ క్యాంప‌స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. వ్య‌వ‌సాయంలో వినూత్న ప‌ద్ధ‌తుల‌ను వాడుతున్న రైతుల‌తోనూ, ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు.