‘నాగ్ పుర్ మెట్రో ఫేజ్-2’ కు శంకు స్థాపన చేసిన ప్రధాన మంత్రి;‘నాగ్ పుర్ మెట్రో ఫేజ్-1’ ని దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు

December 11th, 10:15 am

‘నాగ్ పుర్ మెట్రో ఒకటో దశ’ ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం చేశారు. దీనితో పాటు గా ఖాప్ రీ మెట్రో స్టేశన్ లో ‘నాగ్ పుర్ మెట్రో రెండో దశ’ కు శంకుస్థాపన కూడా చేశారు. ప్రధాన మంత్రి ఖాప్ రీ నుండి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు, ఇంకా ప్రజాపతి నగర్ నుండి లోక్ మాన్య నగర్ వరకు మొదటి సారి గా రాక పోకల ను జరిపిన రెండు మెట్రో రైళ్ళ కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. నాగ్ పుర్ మెట్రో లో భాగం గా ఒకటో దశ ను 8650 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. ఇక రెండో దశ ను 6700 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది.