భారతదేశం యొక్క రాబోయే వెయ్యి సంవత్సరాలకు మేము బలమైన పునాది వేస్తున్నాము: ఆస్ట్రియాలో ప్రధాని మోదీ
July 10th, 11:00 pm
వియన్నాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గత 10 సంవత్సరాలలో దేశం సాధించిన పరివర్తనాత్మక పురోగతి గురించి ఆయన ప్రసంగించారు మరియు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా - విక్షిత్ భారత్‌గా మారే మార్గంలో భారతదేశం సమీప భవిష్యత్తులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఆస్ట్రియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 10th, 10:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియన్నా లో ప్రవాసీ భారతీయులు ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొని, భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమ స్థలానికి ప్రధాన మంత్రి రాగానే, భారతీయ సముదాయం ఆయనకు ఎంతో ఉత్సాహం తోను, ఆప్యాయంగాను స్వాగతం పలికింది. ఆస్ట్రియా కార్మిక, ఆర్థిక వ్యవస్థ శాఖ మంత్రి శ్రీ మార్టిన్ కొచెర్ కూడా ఈ సాముదాయిక సభ లో పాలుపంచుకొన్నారు. ఆస్ట్రియా నలుమూలలా విస్తరించివున్న ప్రవాసీ భారతీయులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.భారత-ఆస్ట్రియా సీఈవోల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 10th, 07:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ గౌరవనీయ కార్ల్ నెహమ్మర్ ఇవాళ భారత-ఆస్ట్రియా దేశాల్లోని భిన్న రంగాల అగ్రగామి సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారు(సీఈవో)ల సమావేశంలో సంయుక్తంగా ప్రసంగించారు. ఉభయ దేశాల్లోని ఆటోమొబైల్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, ఇంజినీరింగ్ రంగాలు సహా పలు అంకుర సంస్థల సీఈవోలు ఇందులో పాల్గొన్నారు.ఆస్ట్రియాలోని వియన్నా చేరుకున్న ప్రధాని మోదీ
July 09th, 11:45 pm
తన రెండు దేశాల పర్యటనలో భాగంగా రెండో విడత ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియాలోని వియన్నా చేరుకున్నారు. ప్రధాని తన పర్యటనలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ మరియు ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌లను కలుస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి.భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రియా ను సందర్శించనుండగా, ఆ యాత్ర ను స్వాగతించిన ఆస్ట్రియా చాన్స్ లర్; కృత జ్ఞతను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
July 07th, 08:57 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలోనే ఆస్ట్రియా కు ఆధికారిక సందర్శన కు బయలుదేరనుండగా ఈ విషయం లో ఆస్ట్రియా చాన్స్ లర్ శ్రీ కార్ల్ నెహమర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ఆస్ట్రియా ను సందర్శించనుండడం నలభై సంవత్సరాలలో ఇదే తొలిసారి. ‘‘ఈ సందర్శన ఒక విశేషమైన గౌరవం. ఎందుకంటే గత నలభై సంవత్సరాలలో భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ఆస్ట్రియా కు జరపనున్న మొట్టమొదటి యాత్ర ఇది; అంతేకాదు, ఇది ఒక ప్రముఖమైన మైలురాయి కూడా. భారతదేశం తో మా దౌత్య సంబంధాల కు 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందుకు గుర్తుగా మనం కలసి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం కూడా.’’ అని ఆస్ట్రియా చాన్స్ లర్ అన్నారు.రష్యన్ ఫెడరేషన్.. రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలలో (2024 జూలై 08-10 మధ్య) ప్రధాని పర్యటన
July 04th, 05:00 pm
ఈ మేరకు రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానొం మేరకు 2024 జూన్ 8,9 తేదీల్లో ప్రధానమంత్రి మాస్కో సందర్శిస్తారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగే 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల బహుముఖ సంబంధాలను సమీక్షిస్తారు. అలాగే పరస్పర ప్రయోజనంగల సమకాలీన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.