యుఎస్ఎ 246వ స్వాతంత్య్ర దినం సందర్భం లో శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
July 04th, 11:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) 246వ స్వాతంత్య్ర దినం నాడు యుఎస్ఎ ప్రజల కు, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ కు మరియు యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి కి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 12th, 08:58 pm
కోవిడ్ మహమ్మారి జన జీవనాల కు, సరఫరా వ్యవస్థల కు అంతరాయాలను కలిగిస్తూనే ఉంది; సముదాయాల ప్రతిఘాతుకత్వాని కి అది పరీక్షలు పెడుతూనే ఉంది. భారతదేశం లో మేం మహమ్మారి కి వ్యతిరేకం గా ప్రజల ను కేంద్ర స్థానం లో ఉంచిన వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. మేం మా వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెటు కు ఇదివరకు ఎన్నడూ చేయనంత అధిక కేటాయింపు ను చేశాం.రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి
May 12th, 06:35 pm
యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసఫ్ ఆర్. బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో పాలుపంచుకొన్నారు. ‘మహమ్మారి యొక్క అలసట ను అడ్డుకోవడం మరియు సన్నాహాల కు ప్రాధాన్యాల ను నిర్ణయించడం’ ఇతివృత్తం పై ఏర్పాటైన ఈ శిఖర సమ్మేళనం తాలూకు ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు.యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు శ్రేష్ఠురాలు కమలా హారిస్ గారి తో తన సమావేశం లో ప్రధాన మంత్రి ప్రారంభిక వ్యాఖ్యలు
September 24th, 02:15 am
అన్నింటికంటే ముందు, నాకు మరియు నా ప్రతినిధి వర్గాని కి ఆత్మీయ స్వాగతం పలికినందుకు నేను మీకు హృదయపూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేయదలచాను. కొన్ని నెలల క్రితం మీ తో టెలిఫోన్ ద్వారా విపులమైన, చాలా ఆత్మీయత నిండిన, ఎంతో స్వాభావికమైన పద్ధతి లో మీతో చర్చ ను జరిపేందుకు నాకు అవకాశం దొరికింది. మరి ఆ ఘటన నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. దీనికి గాను మీకు చాలా ధన్యవాదాలు. అది, ఎక్స్ లన్సి, మీకు గుర్తు ఉండే ఉంటుంది.. అప్పట్లో ఎంతో క్లిష్టమైన కాలం. భారతదేశం కోవిడ్-19 మహమ్మారి తాలూకు సెకండ్ వేవ్ తో బాగా బాధ కు గురైంది. అది పెద్ద సంకటం గా ఉండింది. కానీ ఆ సమయం లో ఏ విధమైన ఆత్మీయత తో మీరు భారతదేశం గురించి ఆలోచించారో, ఎలాంటి మాటల ను వ్యక్తం చేశారో, మరి ఏ తీరు న సాయం చేయడానికి చేతి ని చాచారో..దానికి గాను నేను మళ్లీ ఒక సారి హృదయ పూర్వకం గా మీకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. మీరు ఒక సిసలైన నేస్తం లాగా ఎంతో సానుభూతిపూర్ణమైన సహకార సందేశాన్ని అందించారు. ఆ కాలం లో యుఎస్ ప్రభుత్వం, యుఎస్ కార్పొరేట్ సెక్టర్, ప్రవాసీ భారతీయులు.. అందరు కలసి.. భారతదేశాని కి సాయపడేందుకు ఒక్కటై ముందంజ వేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, మరియు యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మధ్య జరిగిన సమావేశం
September 24th, 02:14 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ను సందర్శించిన కాలం లో 2021 సెప్టెంబర్ 23 న వాశింగ్ టన్ డిసి లో యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి తో సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి యుఎస్ఎ సందర్శన కు బయలుదేరి వెళ్ళే ముందు జారీ చేసిన ప్రకటన
September 22nd, 10:37 am
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట నేను 2021 సెప్టెంబర్ 22-25 తేదీ ల మధ్య కాలం లో యుఎస్ఎ ను సందర్శించనున్నాను.కమలా హారిస్ పదవీ స్వీకారం సందర్భం లో ఆమె కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
January 21st, 09:19 am
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్ష పదవి బాధ్యతల ను కమలా హారిస్ స్వీకరించిన సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందన లు తెలిపారు.అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ ఆర్ బిడెన్ తో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.
November 17th, 11:58 pm
అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన హిస్ ఎక్స్ లెన్సీ శ్రీ జోసెఫ్ ఆర్. బిడెన్ తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలా హారిస్ కు శుభాకాంక్షలు
November 08th, 10:23 am
అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీమతి కమలా హారిస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.