ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

January 25th, 02:00 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నరు ఆనందీబెన్ పటేల్ గారు, గౌరవనీయ యుపి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ జీ, కేంద్ర మంత్రి శ్రీ వి.కె.సింగ్ గారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, విశిష్ట ప్రతినిధులు, మరియు బులంద్ షహర్ యొక్క నా ప్రియమైన సోదర సోదరీమణులు!

పంతొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయల కు పైచిలుకువిలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కూడాచేసిన ప్రధాన మంత్రి

January 25th, 01:33 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 19,100 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపనలను కూడా చేశారు. ఆయా ప్రాజెక్టు లు రేల్ వే, రహదారులు, చమురు, ఇంకా గ్యాస్, పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

September 14th, 12:01 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ గారు, ఉత్తర ప్రదేశ్ యువ, చురుకైన ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దినేష్ శర్మ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలీగఢ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

September 14th, 11:45 am

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

శ్రీ కళ్యాణ్ సింహ్ కన్నుమూత పట్ల ప్రసార మాధ్యమాల కు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

August 22nd, 11:42 am

ఇది మనకు అందరికి ఒక దు:ఖభరిత ఘడియ. కళ్యాణ్ సింహ్ గారి తల్లితండ్రులు ఆయన కు కళ్యాణ్ సింహ్ అని పేరు పెట్టారు. ఆయన తన తల్లితండ్రులు తనకు పెట్టిన పేరు ను సార్థకం అయ్యేటటువంటి మార్గం లో తన జీవనాన్ని గడిపారు. ఆయన తన యావత్తు జీవనాన్ని ప్రజల కళ్యాణం కోసం అంకితం చేశారు; మరి ఆయన దానినే తన జీవన మంత్రం గా చేసివేసుకొన్నారు. ఆయన తనను తాను భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జన సంఘ్ కోసం, అలాగే మరి దేశం యొక్క ఉజ్జ్వల భవిష్యత్తు కోసం సమర్పణం చేశారు.

శ్రీ కళ్యాణ్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి

August 21st, 10:23 pm

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్, సీనియర్ నాయకుడు శ్రీ కళ్యాణ్ సింగ్ గారి మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కల్యాణ్ సింహ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అసంఖ్యాక ప్రజానీకం తో పాటు తాను కూడా ప్రార్థిస్తున్న ప్రధాన మంత్రి

July 09th, 10:13 am

కల్యాణ్ సింహ్ గారి మనవడి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. జబ్బుపడ్డ కల్యాణ్ సింహ్ గారికి త్వరగా నయం అవ్వాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు. కల్యాణ్ సింహ్ గారి తో తాను జరిపిన సమావేశాల గురించి కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చుకొన్నారు. కల్యాణ్ సింహ్ గారి తో మాట్లాడిన ప్రతి సారీ తాను పలు విషయాలు నేర్చుకోగలిగానని ప్రధాన మంత్రి చెప్పారు.