కోవిడ్‌-19 తాజా స్థితిపై అన్ని రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

April 08th, 09:24 pm

దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితి తీవ్ర‌తను స‌మీక్షించిన స‌మ‌యంలో మీరంతా ఎన్నో ముఖ్య‌మైన అంశాలు ప్ర‌స్తావించారు. ఎన్నో స‌ల‌హాలు ఇచ్చారు. క‌రోనా విస్త‌ర‌ణ జోరుగా ఉన్న‌, మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న రాష్ర్టాల‌తో ప్ర‌త్యేక చ‌ర్చ జ‌ర‌గ‌డం చాలా స‌హ‌జం. కాని ఇత‌ర రాష్ర్టాలు కూడా చాలా చ‌క్క‌ని స‌ల‌హాలు ఇవ్వొచ్చు. కాబ‌ట్టి స‌మ‌ర్థ‌వంత‌మైన వ్యూహం రూపొందించేందుకు అవ‌స‌ర‌మైన సానుకూల స‌ల‌హాలు ఇవ్వాల‌ని మీ అంద‌రినీ అభ్య‌ర్థిస్తున్నాను.

కోవిడ్‌-19 ప‌రిస్థితిపై ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి భేటీ

April 08th, 09:23 pm

దేశంలో ప్ర‌స్తుతం కోవిడ్‌-19 తీరుతెన్నుల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వివిధ రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌తో గురువారం వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా చ‌ర్చించారు.