‘‘మూడు కొత్త నేర విచారణ చట్టాలు’’ విజయవంతంగా అమలు.. దేశానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 03rd, 12:15 pm

చండీగఢ్‌కు రావడమంటే అది నా సొంత ప్రజల మధ్యకు వచ్చినట్లు అనిపిస్తుంది. చండీగఢ్ గుర్తింపు శక్తి స్వరూపిణి చండీదేవి మాతతో జతపడి ఉంది. చండీ మాత సత్యానికి, న్యాయానికి ప్రతీక. ఇదే భావన భారతీయ న్యాయ సంహితకు, భారతీయ నాగరిక్ సురక్ష సంహితకు పునాదిగా ఉంది. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని తీసుకొని ముందుకు సాగిపోతున్న కాలంలో, మన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అయిన వేడుకలను మనం జరుపుకొంటున్న క్రమంలో రాజ్యాంగ ఆదర్శాల నుంచి ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం విజయ ప్రస్థానంలో మరో మెట్టు అని చెప్పాలి. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో ప్రస్తావించుకొన్న ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక ప్రత్యేక చర్య. కొద్దిసేపటి కిందటే నేను ఈ చట్టాలు అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించాను. ఈ అంశాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవాదుల సంఘం సభ్యులు (బార్), న్యాయాధికారులు సహా అందరూ.. వారి వీలునుబట్టి చూడాల్సిందని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితలు ఆచరణలోకి వచ్చినందుకుగాను పౌరులందరికీ నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. చండీగఢ్ పాలన యంత్రాంగంలోని వారందరినీ అభినందిస్తున్నాను.

కొత్తగా తెచ్చిన మూడు నేరవిచారణ చట్టాల అమలు విజయవంతం చండీగఢ్‌లో దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి

December 03rd, 11:47 am

పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌.. విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... చండీదేవి మాతతో చండీగఢ్‌ గుర్తింపు జతపడి ఉందన్నారు. శక్తులలో ఒక రూపమే చండీదేవి, సత్యానికి, న్యాయానికి ప్రతీక చండీదేవి అని ఆయన అన్నారు. ఇవే అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలను సమగ్రంగా రూపొందించారన్నారు. దేశ ప్రజలు... భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొంటున్న, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) సంకల్పంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం ఒక గొప్ప సందర్భం అని ప్రధాని అన్నారు. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక గట్టి ప్రయత్నమని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త చట్టాలను అమలుచేస్తున్న తీరుతెన్నులపై ఒక ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటుచేయగా ఆ ప్రదర్శనలో కొంత భాగాన్ని తాను కాసేపటి కిందటే చూశానని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. చట్టాలు అమలవుతున్న తీరును వివరించే ఈ ప్రత్యక్ష ప్రదర్శనను చూడాల్సిందిగా ప్రజలను ప్రధానమంత్రి కోరారు. కొత్తగా తెచ్చిన మూడు నేర విచారణ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా దేశ పౌరులందరికీ ఆయన తన స్నేహపూర్వక అభినందనలు తెలిపారు. చండీగఢ్ పాలన యంత్రాంగంలో ప్రతి ఒక్కరినీ కూడా ఆయన అభినందించారు.

Judiciary has consistently played the moral responsibility of being vigilant : PM Modi in Jodhpur

August 25th, 05:00 pm

Prime Minister Narendra Modi attended the Platinum Jubilee celebrations of the Rajasthan High Court in Jodhpur, where he highlighted the importance of the judiciary in safeguarding democracy. He praised the High Court's contributions over the past 75 years and emphasized the need for modernizing the legal system to improve accessibility and efficiency.

రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 25th, 04:30 pm

మహారాష్ట్ర నుండి బయలు దేరిన సమయంలో వాతావరణం సరిగా లేనికారణంగా- జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేసిన ఆయన, భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజస్థాన్ హైకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. ఎందరో మహానుభావులు అందించిన న్యాయం, వారి చిత్తశుద్ధీ, అంకితభావాన్నీ గౌరవించుకునే సందర్భమిది అని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగం పట్ల దేశానికి ఉన్న విశ్వాసానికి నేటి కార్యక్రమం ఒక ఉదాహరణ అని, ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేవారందరికీ, రాజస్థాన్ ప్రజలకూ ప్రధాని అభినందనలు తెలియజేశారు.

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం 23 సెప్టెంబరు, 2023

September 23rd, 10:59 am

ప్రపంచ న్యాయ విభాగానికి చెందిన ప్రముఖులందరినీ కలవడం, వారందరి మధ్యన ఉండే అవకాశం రావడం నాకు ఒక అద్భుతమైన అనుభవం. భారత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు నేడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడ ఉన్నారు. ఇంగ్లండ్ లార్డ్ చాన్సలర్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇంగ్లండ్ కు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు మన మధ్యన ఉన్నారు. అలాగే కామన్వెల్త్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు కూడా వచ్చారు. ఆ రకంగా నేటి ఈ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ‘‘వసుధైవ కుటుంబకం’’ (ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అనే భారత్ సెంటిమంట్ కు ఒక చిహ్నంగా నిలిచింది. భారత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంతర్జాతీయ అతిథులందరికీ హృద‌యపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమం చేపట్టే బాధ్యత హృద‌యపూర్వకంగా స్వీకరించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను.

న్యూఢిల్లీలో ‘అంతర్జాతీయ న్యాయవాద సదస్సు-2023’ను ప్రారంభించిన ప్రధానమంత్రి

September 23rd, 10:29 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ‘అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు-2023’ను ప్రారంభించారు. జాతీయ-అంతర్జాతీయ ప్రాముఖ్యంగల వివిధ చట్టపరమైన అంశాలపై అర్థవంతమైన సంప్రదింపులు-చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడటం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అలాగే ఆలోచనలు-అనుభవాల ఆదానప్రదానాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారంతోపాటు చట్టపరమైన సమస్యలపై అవగాహనను బలోపేతం చేయడం దీని ప్రధానోద్దేశాలు.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ప్రధాన మంత్రి సమాధానం పూర్తి పాఠం

February 10th, 04:22 pm

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు లోక్‌స‌భ‌లో స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం భార‌త దేశ సంక‌ల్ప శ‌క్తిని ప్ర‌తిబింబించింద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న మాట‌లు భార‌త‌దేశ ప్ర‌జ‌లలో విశ్వాసాన్ని నింపాయ‌ని అన్నారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పెద్ద సంఖ్య‌లో మ‌హిళా పార్ల‌మెంటు స‌భ్యులు చ‌ర్చ‌లో పాల్గొన్నార‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, వారి ఆలోచ‌న‌ల ద్వారా స‌భ చ‌ర్చ‌ల స్థాయిని పెంచినందుకు ఆయ‌న వారిని అభినందించారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌స‌భ‌లో స‌మాధాన‌మిచ్చిన ప్ర‌ధాన‌మంత్రి

February 10th, 04:21 pm

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు లోక్‌స‌భ‌లో స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం భార‌త దేశ సంక‌ల్ప శ‌క్తిని ప్ర‌తిబింబించింద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న మాట‌లు భార‌త‌దేశ ప్ర‌జ‌లలో విశ్వాసాన్ని నింపాయ‌ని అన్నారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పెద్ద సంఖ్య‌లో మ‌హిళా పార్ల‌మెంటు స‌భ్యులు చ‌ర్చ‌లో పాల్గొన్నార‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, వారి ఆలోచ‌న‌ల ద్వారా స‌భ చ‌ర్చ‌ల స్థాయిని పెంచినందుకు ఆయ‌న వారిని అభినందించారు.

Rule of Law has been the basis of our civilization and social fabric: PM

February 06th, 11:06 am

PM Modi addressed Diamond Jubilee celebrations of Gujarat High Court. PM Modi said, Our judiciary has always interpreted the Constitution positively and strengthened it. Be it safeguarding the rights of people or any instance of national interest needed to be prioritised, judiciary has always performed its duty.

గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన – ప్రధానమంత్రి

February 06th, 11:05 am

గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. హైకోర్టు స్థాపించి, అరవై సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో – కేంద్ర చట్టము, న్యాయ శాఖ మంత్రి; సుప్రీం కోర్టు, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు; గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు, న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు వ్యక్తులు పాల్గొన్నారు.

సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వత క్యాంప‌స్‌కు శంకుస్థాప‌న‌ చేసిన సందర్భంగా ప్రధాన‌మంత్రి ప్రసంగ మూల పాఠం

January 02nd, 11:01 am

ఒరిస్సాలోని సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఒరిస్సా గ‌వ‌ర్న‌ర్‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.

సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్‌కు శంకుస్థాప‌న‌చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

January 02nd, 11:00 am

ఒరిస్సాలోని సంబ‌ల్‌పూర్ ఐఐఎం శాశ్వ‌త క్యాంప‌స్ కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఒరిస్సా గ‌వ‌ర్న‌ర్‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రులు శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిశాంక్‌, శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగిలు పాల్గొన్నారు.

The people of India are our high command, we are committed to fulfill all their aspirations: PM Modi

November 24th, 11:45 am

Prime Minister Narendra Modi today addressed two huge public meeting in Chhatarpur and Mandsaur in Madhya Pradesh in a series of similar rallies previously organised in the poll-bound state of Madhya Pradesh.

Reject the negative politics of Congress: PM Modi urges people of Madhya Pradesh

November 24th, 11:45 am

Prime Minister Narendra Modi today addressed two huge public meeting in Chhatarpur and Mandsaur in Madhya Pradesh in a series of similar rallies previously organised in the poll-bound state of Madhya Pradesh.

Country is moving towards women-led development

May 04th, 09:47 am

Continuing his interactions through the Narendra Modi Mobile App, the Prime Minister today interacted with BJP Mahila Morcha of Karnataka. Appreciating the role and increasing participation of women in society, he said that the country was moving towards ‘women-led development’ from just development of women.

PM Modi's Interaction with BJP Mahila Morcha

May 04th, 09:46 am

Continuing his interactions through the Narendra Modi Mobile App, the Prime Minister today interacted with BJP Mahila Morcha of Karnataka. Appreciating the role and increasing participation of women in society, he said that the country was moving towards ‘women-led development’ from just development of women.

“వ్యవసాయం 2022 : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం” అంశంపై జరిగిన జాతీయ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

February 20th, 05:47 pm

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చిన శాస్త్రవేత్తలు, రైతు మిత్రులు మరియు ఇక్కడ హాజరైన ప్రముఖులారా,

‘‘అగ్రికల్చర్ 2022- డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్స్’’ అంశం పై జాతీయ స‌మావేశంలో ప్ర‌సంగించిన‌ ప్రధాన మంత్రి

February 20th, 05:46 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘అగ్రికల్చర్ 2022- డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్స్’’ అంశం పై ఢిల్లీ లోని పూసా లో ఉన్న ఎన్ఎఎస్‌సి కాంప్లెక్స్ లో నేడు నిర్వ‌హించిన జాతీయ స‌మావేశంలో పాలుపంచుకొన్నారు.

'నవ భారతదేశం' కాదు, అవినీతి మరియు కుంభకోణాలతో నిండిన 'పురాతన భారతదేశాన్ని’ కాంగ్రెస్ కోరుకుంటుంది: ప్రధాని మోదీ

February 07th, 05:01 pm

వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించడంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.

రాజ్య సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని

February 07th, 05:00 pm

నేడు లోక్సభలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో లోక్సభ, విధానసభ ఎన్నికలను నిర్వహించాలనే విషయంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకుంటూ, దిగువ స్థాయిలో ప్రజల జీవితాలను మార్చివేసే లక్ష్యంతో చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు.