నార్వే ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

November 19th, 05:44 am

బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టోర్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.

నార్వే ప్ర‌ధాన‌మంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ తో ఫోన్‌లో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

September 09th, 07:57 pm

ఇరువురు నాయ‌కులు, ద్వైపాక్షిక‌, అంత‌ర్జాతీయ అంశాల‌ను, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌న‌క‌ర అంశాల‌ను చ‌ర్చించారు. అలాగే వ‌ర్ధ‌మాన దేశాల‌లో పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్రాజెక్టుల‌కు క్లైమేట్ ఫైనాన్స్ ను స‌మ‌కూర్చేంఉద‌కు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌లను వారు చర్చించారు. వ‌ర్ధ‌మాన ప్ర‌పంచానికి స‌కాలంలో, త‌గినంత , న్యాయ‌బ‌ద్ధ‌మైన క్లైమేట్ ఫైనాన్స్ అందేలా చేయాల్సిన అంశం ప్రాధాన్య‌త గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ఈ దిశ‌గా హిజ్ ఎక్స‌లెన్సీ స్టోర్ నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు.

నార్వే ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

May 04th, 02:25 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండో ఇండియా- నార్డిక్ సమిట్ జరిగిన సందర్భం లో కోపెన్ హేగన్ లో నార్వే ప్రధాని శ్రీ జోనస్ గహర్ స్టోర్ తో సమావేశమయ్యారు. ప్రధాని శ్రీ స్టోర్ 2021వ సంవత్సరం లో అక్టోబరు లో పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత ఇద్దరు నేతల మధ్య ఇదే ఒకటో సమావేశం.

నార్వే ప్రధాని గా శ్రీ జోనస్‌ గహర్ స్టోర్‌ పదవీబాధ్యతల ను స్వీకరించడం పట్ల అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

October 16th, 09:38 pm

నార్వే ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ జోనస్ గహర్ స్టోర్‌ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.