297 పురాతన వస్తువులను భారత్‌కు తిరిగిచ్చిన అమెరికా
September 22nd, 12:11 pm
భారత్, అమెరికా మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలకు అనుగుణంగా ఉన్నతమైన సాంస్కృతిక అవగాహనను పెంపొందించుకోవడానికి జూలైలో సాంస్కృతిక సంపద ఒప్పందం కుదిరింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్య, సాంస్కృతిక వ్యవహారాల బ్యూరో, భారత ప్రభుత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల భారతీయ పురావస్తు సర్వేక్షణ విభాగం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు సహకారాన్ని పెంపొందించుకోవాలని 2023 జూన్‌లో జరిగిన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధానమంత్రి మోదీ చేసిన ఉమ్మడి ప్రకటనలోని లక్ష్యాలను నెరవేర్చడంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది.వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు
September 22nd, 12:06 pm
సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా
September 22nd, 12:00 pm
అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన
September 22nd, 11:51 am
ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .క్వాడ్ నేతల క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం
September 22nd, 06:25 am
ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు నేను నా హృదయపూర్వక అభినందనలను తెలియ జేస్తున్నాను. తక్కువ ఖర్చులో సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలన్న మన అందరి నిబద్ధతకు ఇది అద్దం పడుతున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘క్వాడ్ టీకా మందు’’ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మరి ఇక్కడ క్వాడ్ (QUAD)లో గర్భాశయ ముఖద్వారు క్యాన్సర్ వంటి సవాలుకు పరిష్కారాన్ని వెతకాలని మనమంతా కలసి నిర్ణయించాం.ప్రతిష్టాత్మక క్వాడ్ క్యాన్సర్ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
September 22nd, 06:10 am
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తింపు, చికిత్స, నిర్మూలన లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేపట్టిన ఈ ఆలోచనాత్మక చొరవకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇండో-పసిఫిక్ దేశాల ప్రజలకు అందుబాటులో సరసమైన, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్ సైతం దేశంలో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణకు సామూహిక కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్ చేపడుతున్న ఆరోగ్య భద్రత చర్యలపై ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్‌కు టీకాను దేశం అభివృద్ధి చేసిందని, ఈ వ్యాధికి కృత్రిమ మేధ ఆధారిత చికిత్స విధానానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
September 22nd, 05:21 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఫుమియో కిషిదా పాల్గొన్నారు.A free, open, inclusive and prosperous Indo-Pacific is our shared priority and commitment: PM Modi
September 22nd, 02:30 am
In his address at the QUAD Summit, PM Modi underscored the alliance's significant progress since 2021 under President Biden's leadership, highlighting its crucial role in promoting a rules-based international order, respect for sovereignty, and peaceful conflict resolution amidst global tensions. He reaffirmed QUAD’s shared commitment to a free, open, inclusive, and prosperous Indo-Pacific. PM Modi also announced that India will host the QUAD Leaders' Summit in 2025.డెలావర్ లోని విల్మింటన్ లో అమెరికా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
September 22nd, 02:02 am
భారత్ అమెరికాల భాగస్వామ్యానికి ముందుకు తీసుకుపోవడంలో అధ్యక్షుడు శ్రీ బైడెన్ అసమానమైన సేవలను అందించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందలు తెలిపారు. అమెరికాలో 2023 జూన్ లో తాను పర్యటించడాన్ని, అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో భారతదేశంలో జరిగిన జి-20 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారత్ కు రావడాన్ని శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తు చేశారు. ఈ పర్యటనలు భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని ఉపయోగకరంగా మార్చాయనీ, తగిన వేగాన్నీ అందించాయనీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.ఫిలడెల్ఫియా చేరుకున్న ప్రధాని మోదీ
September 21st, 09:16 pm
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలోని ఫిలడెల్ఫియా చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రయాణంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం, అలాగే డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కూడా ఉన్నాయి.అమెరికా పర్యటనకు ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన
September 21st, 04:15 am
అధ్యక్షుడు బైడెన్ తన స్వస్థలం విల్మింగ్టన్ లో నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి, న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తుకు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ ) లో ప్రసంగించడానికి నేను మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు బయలుదేరుతున్నాను.సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
September 19th, 03:07 pm
ప్రధాని మోదీ 21-23 సెప్టెంబర్ 2024 సమయంలో యూఎస్ సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని ప్రసంగిస్తారు.అధ్యక్షుడు బిడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషణ
August 26th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇవాళ అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ జోసెఫ్ ఆర్.బిడెన్ ఫోన్ ద్వారా సంభాషించారు.US National Security Advisor calls on Prime Minister Shri Narendra Modi
June 17th, 07:44 pm
US National Security Advisor, H.E. Mr. Jake Sullivan, called on Prime Minister Shri Narendra Modi today.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అయినసందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీ బైడెన్
June 05th, 11:07 pm
భారతదేశాని కి ప్రధాన మంత్రి గా చరిత్రాత్మకమైనటువంటి మూడో పర్యాయం తిరిగి ఎన్నిక అయినందుకు గాను ప్రధాన మంత్రి కి స్నేహపూర్ణమైన అభినందనల ను అధ్యక్షుడు శ్రీ బైడెన్ వ్యక్తం చేశారు.అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కి మరియు అమెరికా రక్షణ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన ప్రధాన మంత్రి
November 10th, 08:04 pm
యు.ఎస్. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఏంటనీ బ్లింకన్ మరియు యు.ఎస్. రక్షణ శాఖ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.గ్లోబల్ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ ఇన్ వెస్ట్ మంట్ (పిజిఐఐ) మరియు ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకానామిక్కారిడర్ ల కోసం భాగస్వామ్యం
September 09th, 09:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ లు 2023 సెప్టెంబరు 9 వ తేదీ న న్యూ ఢిల్లీ లో జి-20 శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతున్న నేపథ్యం లో, గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ ఇన్ వెస్ట్ మంట్ (పిజిఐఐ) మరియు ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకానామిక్ కారిడర్ ల కోసం భాగస్వామ్యం అంశం పై ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమాని కి సంయుక్తం గా అధ్యక్షత ను వహించారు.గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (పి.జి.ఐ.ఐ) & ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ కోసం భాగస్వామ్యంపై జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు - తెలుగు అనువాదం
September 09th, 09:27 pm
మహనీయులు, గౌరవనీయులైన మీ అందరికీ, ఈ ప్రత్యేక కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కలిసి ఈ కార్యక్రమానికి సహ-అధ్యక్షుడిగా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు, ఒక ముఖ్యమైన, చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. రాబోయే కాలంలో, ఇది భారతదేశం, పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారనుంది.భారత, అమెరికా ఉమ్మడి ప్రకటన
September 08th, 11:18 pm
భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వాగతం పలికారు. భారత, అమెరికా దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ఇద్దరు నేతలు తిరిగి ధ్రువీకరించారు. 2023 జూన్ లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న చారిత్రక విజయాల అమలులో సాగుతున్న పురోగతిని ఉభయులు ప్రశంసించారు.అమెరికా అధ్యక్షుడు బిడెన్ ను కలిసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
September 08th, 09:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు , హిజ్ ఎక్సలెన్సీ , జోసెఫ్ ఆర్.బిడెన్ ను ఈరోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్ తొలిసారిగా అధ్యక్ష హోదాలో ఇండియాలో పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీలలో న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమ్మేళనంలో ఆయన పాల్గొంటున్నారు.