భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
November 06th, 11:30 pm
భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం లోకి మనఃపూర్వకంగా స్వాగత వచనాల ను పలికారు.భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
September 14th, 07:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో సమావేశమయ్యారు.ప్రధానమంత్రికి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
December 17th, 08:42 pm
భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భూటాన్ రాజు మాననీయ జిగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో’ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సాదర సత్కారంపై మాననీయ భూటాన్ రాజుకు శ్రీ మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రధాన మంత్రి కి, భూటాన్ రాజు కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
September 17th, 11:20 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యెల్ వాంగ్ చుక్ తో ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యెల్ వాంగ్ చుక్ తో ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు. ప్రధాన మంత్రి 70వ పుట్టిన రోజు ను పురస్కరించుకొని ఆయనకు భూటాన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి ఈ శుభాకాంక్షలను కృతజ్ఞతపూర్వకంగా స్వీకరిస్తూ, భూటాన్ రాజు తో పాటు భూటాన్ మాజీ రాజు కు, అలాగే భూటాన్ రాజకుటుంబ సభ్యులందరికీ కూడా తన నమస్కారాలందజేశారు. భారతదేశాన్ని, భూటాన్ ను ఇరుగు పొరుగు దేశాలు గానే గాక, మిత్ర దేశాలుగా కూడా కలిపి ఉంచుతున్న నమ్మకం, ప్రేమ అనే అద్వితీయ బంధాలను గురించి నేతలు మాట్లాడుకొన్నారు. ఈ ప్రత్యేక మైత్రిని పెంచి పోషించడం లో భూటాన్ కు చెందిన రాజు లు మార్గదర్శకప్రాయ పాత్ర ను పోషిస్తున్నందుకు ప్రధాన మంత్రి తన ధన్యవాదాలు తెలిపారు. భూటాన్ రాజ్యం లో కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ని ప్రభావవంతంగా అడ్డుకొంటున్నందుకు ప్రధాన మంత్రి హర్షాన్ని ప్రకటించారు. ఈ విషయం లో భూటాన్ కు అవసరమైన అన్ని రకాలుగా సాయపడటానికి భారతదేశం సిద్ధంగా ఉందంటూ రాజు కు ఆయన హామీని ఇచ్చారు. ఇరు పక్షాల కు వీలైన సమయం లో రాజు ను, రాజుగారి కుటుంబాన్ని భారతదేశ సందర్శన కు ఆహ్వానించాలని ఉందంటూ ప్రధాన మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కొత్త సంవత్సరం సందర్భం లో టెలిఫోన్ ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
January 01st, 05:38 pm
కొత్త సంవత్సరం ఆరంభ దినం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పలువురు ప్రముఖుల తో టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు. వారి లో కింగ్ డమ్ ఆఫ్ భూటాన్ యొక్క రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్చుక్, భూటాన్ ప్రధాని డాక్టర్ లాయెన్‌చెన్ (డాక్టర్) లోటే శెరింగ్, శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ గోటాబాయా రాజపక్ష, శ్రీ లంక ప్రధాని శ్రీ మహీంద రాజపక్ష, మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా మరియు నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ లు ఉన్నారు.భూటాన్ గౌరవ రాజు, గౌరవ రాణి మరియు యువరాజులను కలిసిన ప్రధాని
November 01st, 09:26 pm
నేడు ప్రధానమంత్రి తన నివాసంలో భూటాన్ గౌరవ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, గౌరవ రాణి జెట్సన్ పెమా వాంగ్చుక్ మరియు యువరాజులను కలిశారు.PM meets His Majesty the King of Bhutan
June 15th, 08:05 pm
PM meets His Majesty the King of Bhutan