ఝాన్సీ వైద్య కళాశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారులు మరణించడంతో ప్రధానమంత్రి సంతాపం

November 16th, 08:23 am

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వైద్య కళాశాలలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు చేతనైన ప్రతి ఒక్క సహాయాన్ని అందించడంలో నిమగ్నం అయిందని ఆయన హామీనిచ్చారు.

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

ఉత్తరప్రదేశ్‌ లోని ఝాన్సీలో నీటి సంరక్షణ, భూగర్భ జలమట్టాలను పెంపొందించడం కోసం చేస్తున్న కృషిని ప్రశంసించిన - ప్రధానమంత్రి

September 05th, 10:09 pm

నియోజకవర్గంలో అంతరించిపోతున్న నదుల పునరుజ్జీవనం, వివిధ అమృత్ సరోవర్ల నిర్మాణం గురించి ఝాన్సీ పార్లమెంటు సభ్యులు ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా చేసిన సందేశానికి ప్రధానమంత్రి ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా ప్రతిస్పందిస్తూ;

భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

April 01st, 03:51 pm

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ గారు, రైల్వే మంత్రి అశ్విని గారు, ఇతర ప్రముఖులందరూ, ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన భోపాల్ లోని నా ప్రియమైన సోదర సోదరీమణులు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

April 01st, 03:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భోపాల్ నుంచి న్యూఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం జరిగే ప్రదేశానికి రాగానే ప్రధానమంత్రి రాణి కమలాపతి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించి రైలు సిబ్బందితోను, రైలులోని బాలలతోను సంభాషించారు.

ఝాన్సీలోని అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్‌తో నగరంసహా సమీప ప్రాంతాల్లో పర్యాటక-వాణిజ్యాభివృద్ధికి మరింత ఉత్తేజం: ప్రధానమంత్రి

March 26th, 10:54 am

ఝాన్సీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరంగా రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్ వల్ల నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో పర్యాటక-వాణిజ్యాభివృద్ధికి మరింత ఉత్తేజం లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశమంతటా ఆధునిక స్టేషన్ల రూపకల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఝాన్సీని ఆధునికీకరించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.

రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్న ప్రధానమంత్రి

November 19th, 08:58 am

రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెను స్మరించుకున్నారు. ఆమె ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన అనిర్వచనీయ త్యాగం చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు.

PM Modi addresses a public meeting in Fatehpur, Uttar Pradesh

February 17th, 04:07 pm

Addressing an election rally in Uttar Pradesh’s Fatehpur to campaign for the BJP for the upcoming state polls, Prime Minister Narendra Modi said, “I am coming from Punjab. The mood in Punjab is to vote for BJP. Every phase of UP polls is voting for BJP. The people of Uttar Pradesh are determined to hold colourful celebrations of victory on 10th March, ahead of Holi.”

Coronavirus and those opposing vaccine are scared of it: PM Modi in Fatehpur, Uttar Pradesh

February 17th, 04:01 pm

Addressing an election rally in Uttar Pradesh’s Fatehpur to campaign for the BJP for the upcoming state polls, Prime Minister Narendra Modi said, “I am coming from Punjab. The mood in Punjab is to vote for BJP. Every phase of UP polls is voting for BJP. The people of Uttar Pradesh are determined to hold colourful celebrations of victory on 10th March, ahead of Holi.”

ఎన్ సిసి దినం నాడుఎన్ సిసి కేడెట్స్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

November 28th, 06:14 pm

ఎన్ సిసి దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ సిసి కేడెట్స్ కు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతటా ఉన్నటువంటి ఎన్ సిసి పూర్వ విద్యార్థులు ఎన్ సిసి పూర్వ విద్యార్థుల సంఘం యొక్క కార్యకలాపాల లో పాలుపంచుకొంటూ ఉండాలని, అంతేకాకుండా, వారి సమర్ధన ద్వారా ఆ సంఘాన్ని వర్ధిల్లేటట్లు చేయాలని శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ఇది భారతదేశ వృద్ధి కథ యొక్క మలుపు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

November 28th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' కోసం మరోసారి కలిశాం. రెండు రోజుల తర్వాత డిసెంబరు నెల కూడా మొదలవుతోంది. డిసెంబరు రాగానే సంవత్సరం గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఏడాదికి చివరి నెల కావడంతో కొత్త ఏడాదికి పునాదులు వేసుకుంటాం. దేశం అదే నెలలో నౌకా దళ దినోత్సవాన్ని,సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. డిసెంబర్ 16వ తేదీన దేశం 1971 యుద్ధ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాలలోనేను దేశంలోని భద్రతా దళాలను గుర్తుకు తెచ్చుకుంటాను. మన వీరులను స్మరించుకుంటాను. అలాంటి వీరులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగేఈసారి కూడా నమో యాప్ ద్వారానూ మీ గవ్ ద్వారానూ మీ అందరి నుండి నాకు చాలా సూచనలు వచ్చాయి.మీరు నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా భావించి మీ జీవితంలోని సంతోషాలను, బాధలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. మన'మన్ కీ బాత్' కుటుంబం నిరంతరం అభివృద్ధి చెందుతుండడం నాకు సంతోషంగా ఉంటోంది. ఈ కార్యక్రమం మనస్సులతో అనుసంధానమవుతోంది. లక్ష్యాలతో అనుసంధానమవుతోంది. మన మధ్య లోతైన సంబంధంతో మనలో సానుకూల దృక్పథం నిరంతరం ప్రవహిస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 'రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్'లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

November 19th, 05:39 pm

ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ శక్తివంతమైన కర్మయోగి ముఖ్యమంత్రి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, దేశ రక్షణ మంత్రి మరియు ఈ రాష్ట్ర విజయవంతమైన ప్రతినిధి మరియు నా సీనియర్ సహోద్యోగి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జీ, ఎం.ఎస్.ఎం.ఈ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ వర్మ జీ, ఇతర అధికారులు, NCC క్యాడెట్‌లు మరియు పూర్వ విద్యార్థులు మరియు సహచరులు హాజరయ్యారు!

ఉత్తరప్ర‌దేశ్‌లోని ఝాన్సీలో ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్‌ పర్వ్‌’లో పాల్గొన్న ప్ర‌ధానమంత్రి

November 19th, 05:38 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్‌ పర్వ్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ సిమ్యులేషన్‌ ట్రైనింగ్‌’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్‌’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌ రక్షణ పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో వివిధ అభివృద్ధి పథకాలను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

November 19th, 02:06 pm

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రముఖ కర్మయోగి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు డాక్టర్ మహేంద్ర సింగ్ జీ మరియు శ్రీ జిఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు ఆర్కే సింగ్ పటేల్ జీ ,శ్రీ పుష్పేంద్ర సింగ్ జీ, ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో సహచరులు, శ్రీ స్వతంత్రదేవ్ సింగ్ జీ మరియు శ్రీ రాకేష్ గోస్వామి జీ, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు నా ప్రియమైన సోదర, సోదరీమణులు!

ఉత్తరప్ర‌దేశ్‌లోని మ‌హోబాలో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ను జాతికి అంకితం చేసిన ప్ర‌ధానమంత్రి

November 19th, 02:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని మ‌హోబాలో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతంలో నీటి కొరతను తీర్చడానికి, రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన కల్పనకు ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిలో అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వియర్‌ ప్రాజెక్ట్, భయోనీ డ్యామ్ ప్రాజెక్ట్, మడ్‌గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్ట్ తదితరాలున్నాయి. ఈ ప్రాజెక్టులన్నిటికీ కలిపి రూ.3250 కోట్లు వ్యయం కాగా, వీటి ప్రారంభం ద్వారా మహోబా, హమీర్‌పూర్, బందా, లలిత్‌పూర్ జిల్లాల్లో దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతవాసులకు తాగునీరు కూడా అందుతుంది. కాగా, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌ సహా రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

September 14th, 12:01 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ గారు, ఉత్తర ప్రదేశ్ యువ, చురుకైన ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దినేష్ శర్మ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలీగఢ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

September 14th, 11:45 am

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి సెప్టెంబర్ 14న శంకు స్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

September 13th, 11:20 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి 2021 సెప్టెంబన్ 14 న మధ్యాహ్నం 12 గంటల కు శంకు స్థాపన చేయనున్నారు. తరువాత ఇదే కార్యక్రమం లో ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ప్రధాన మంత్రి రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ ల ప్రదర్శన నమూనాల ను సైతం సందర్శిస్తారు.

భార‌త‌దేశ స్వాతంత్య్ర స‌మ‌రం లో పాలుపంచుకొన్న మ‌హానుభావుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

March 12th, 03:21 pm

స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్య‌మాలకు, అల‌జ‌డి ల‌కు, స్వాతంత్య్ర ఉద్య‌మ సంఘర్షణ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆయ‌న ప్రత్యేకించి భార‌త‌దేశ భ‌వ్య స్వాతంత్య్ర స‌మ‌ర గాథ లో లభించవ‌ల‌సినంతటి గుర్తింపు ల‌భించ‌ని ఉద్య‌మాల కు, పోరాటాల కు, విశిష్ట వ్య‌క్తుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి అర్పించారు. అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) ను ప్రారంభించిన అనంత‌రం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 12th, 10:31 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్రవారం నాడు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర‌ యాత్ర‌) ప్రారంభానికి గుర్తు గా పచ్చ‌ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. India@75 ఉత్స‌వాలకై ఉద్దేశించినటువంటి ఇత‌ర విభిన్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ‌గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.