ఆసియా పారాగేమ్స్‌ ‘జావెలిన్ త్రో ఎఫ్-55’ విభాగంలో కాంస్యం గెలిచిన టేక్‌చంద్ మహ్లావత్‌కు ప్రధాని అభినందన

October 28th, 08:32 pm

చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల జావెలెన్ త్రో ఎఫ్‌-55 విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న టేక్‌చంద్ మహ్లావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. మహ్లావత్ ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం సంకల్ప బలానికి, శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని, తద్వారా అతడు దేశం గర్వించే విజయం సాధించాడని వ్యాఖ్యానించారు.

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘జావెలిన్ త్రో’లో స్వర్ణ విజేత నీరజ్ యాదవ్కు ప్రధాని అభినందన

October 28th, 11:26 am

చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘జావెలిన్‌ త్రో ఎఫ్‌-55’లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్‌ యాదవ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ త్రో -F37లో హనీ స్వర్ణపతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి హర్షం

October 25th, 04:42 pm

చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ త్రో -F37 ఈవెంట్ లో స్వర్ణపతకం గెలుచుకున్న హనీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన పుష్పేంద్ర సింగ్ కు ప్రధానమంత్రి అభినందనలు

October 25th, 01:26 pm

చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన పుష్పేంద్ర సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్ లో సుమిత్ ఆంటిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకం గెలిచినందుకు ప్రధానమంత్రి హర్షం

October 25th, 01:24 pm

చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ ఎఫ్ 64 ఈవెంట్ లో పారా ఆసియన్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణ పతకం గెలుచుకున్న సుమిత్ ఆంటిల్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

India is eager to host the Olympics in the country: PM Modi

October 14th, 10:34 pm

PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.

ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

October 14th, 06:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్‌ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.

ఆసియా క్రీడోత్సవాల్లో వరుసగా రెండో సారి జావెలిన్ ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు పిఎం అభినందనలు

October 04th, 08:21 pm

హాంగ్ ఝూలో జరుగుతున్న 2022 ఆసియా క్రీడోత్సవాల్లో వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించినందుకు నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు.

ఆసియా క్రీడల పురుషుల జావెలిన్ త్రోలో రజతం సాధించిన కిషోర్ జెనాకు ప్రధాని అభినందన

October 04th, 08:16 pm

ఆసియా క్రీడల పురుషుల జావెలిన్‌ త్రోలో రజత ప‌త‌కం సాధించిన క్రీడాకారుడు కిషోర్‌ జెనాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

దోహా డైమండ్‌ లీగ్‌ క్రీడల ‘జావెలిన్‌ త్రో’ విజేత నీరజ్‌ చోప్రాకు ప్రధాని అభినందనలు

May 06th, 10:57 am

దోహా డైమండ్‌ లీగ్‌ క్రీడల ‘జావెలిన్‌ త్రో’ క్రీడలో భారత క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా ప్రథమ స్థానంలో నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రపంచచాంపియన్ శిప్ స్ లో పురుషుల జావెలిన్ విభాగం లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ నీరజ్ చోప్ డా కు అభినందన లు తెలియజేసిన ప్రధాన మంత్రి

July 24th, 09:51 am

ప్రపంచ చాంపియన్ శిప్స్ లో పురుషుల జావెలిన్ విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ నీరజ్ చోప్ డా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు

September 09th, 02:41 pm

టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.

ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్‌లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!

September 09th, 10:00 am

2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.

పారాలింపిక్స్ ఆట‌ల లో జావెలిన్ త్రో లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచినందుకు శ్రీ సుమిత్ ఆంతిల్ కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

August 30th, 05:43 pm

టోక్యో లో పారాలింపిక్స్ ఆట‌ల లో జావెలిన్ త్రో లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన శ్రీ సుమిత్ ఆంతిల్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలలో పాల్గొనే భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం

August 17th, 11:01 am

టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలు మరియు పారా అథ్లెట్ల కుటుంబాలు, సంరక్షకులు మరియు కోచ్‌ల కోసం భారత పారా అథ్లెట్ బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. పారా అథ్లెట్ల ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తి కోసం ప్రధాన మంత్రి ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడలకు ఎన్నడూ లేనంత పెద్ద బృందంగా వారి కృషిని అతను ఘనపరిచారు.

టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం తో మాట్లాడిన ప్రధాన మంత్రి

August 17th, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం సభ్యుల తో, వారి కుటుంబాల తో, శిక్షకుల తో, సంరక్షకుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న సమవేశమయ్యారు. ఈ సందర్భం లో క్రీడలు, యువజన వ్యవహారాలు, సమాచారం - ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ కూడా హజరు అయ్యారు.

ప్రత్యేకమైన చిత్రాలు! భారతదేశం గర్వపడేలా చేసిన ఒలింపియన్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు!

August 16th, 10:56 am

ఎర్రకోట ప్రాకారాల నుండి వారిని ప్రశంసిస్తూ, దేశమంతా ప్రశంసలు అందుకున్న ఒక రోజు తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్‌లో పాల్గొని భారతదేశాన్ని గర్వపడేలా చేసిన భారత అథ్లెట్లను కలుసుకున్నారు. ఈవెంట్ నుండి కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి!

టోక్యో 2020లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు భార‌త క్రీడాకారుల‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు

August 08th, 06:24 pm

టోక్యో ఒలింపిక్ క్రీడ‌ల్లో అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన భార‌త క్రీడాకారుల బృందానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. టోక్యో 2020 ముగిసిన సంద‌ర్భంగా ఆయ‌న ఒక సందేశం ఇస్తూ టోక్యోలో భార‌త‌దేశానికి ప్రాతినిథ్యం వ‌హించిన ప్ర‌తీ ఒక్క అథ్లెట్ చాంపియ‌నే అన్నారు.

టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీరజ్ చోప్ డా ను అభినందించిన ప్రధాన మంత్రి

August 07th, 06:12 pm

టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీరజ్ చోప్ డా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. ఆయన ప్రశంసాయోగ్యమైన ఉద్వేగం తో ఆడారు, అంతేకాక సాటిలేనటువంటి ధైర్యాన్ని కనబరచారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారత అథ్లెట్లతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

July 13th, 05:02 pm

మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.