For the first time, tribal society has a feeling of increased participation in policy-making: PM Modi
November 01st, 01:12 pm
PM Modi dedicated and laid the foundation stone of projects worth around Rs. 860 crores in Jambughoda, Panchmahal in Gujarat. Recalling his long association with the area, the Prime Minister expressed great pride in being present at Jambughoda which has been a witness to the great sacrifice of the tribal community of India.గుజరాత్‌లోని జంబుఘోడాలో 860 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 01st, 01:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జంబుఘోడా, పంచమహల్‌లో రూ.860 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- గుజరాత్‌లోని ఆదివాసీ, గిరిజన సమాజాలకు ఇదొక చిరస్మరణీయ దినమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తాను మాన్‌గఢ్‌ను సందర్శించి భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన గోవింద్ గురుసహా వేలాది గిరిజన సమరయోధులకు నివాళులర్పించానని ప్రధాని గుర్తుచేశారు. ఆ ప్రాంతంతో తన దీర్ఘకాల అనుబంధాన్ని ప్రధాని గుర్తుకు తెచ్చుకుంటూ- దేశంలోని గిరిజన సమాజ చేసిన ఎనలేని త్యాగాలకు సాక్షిగా నిలిచిన జంబుఘోడలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. “ఇవాళ మనమంతా గర్వంతో ఉప్పొంగుతున్నాం. షహీద్ జోరియా పరమేశ్వర్, రూప్‌సింగ్ నాయక్, గలాలియా నాయక్, రవ్జిదా నాయక్, బబరియా గల్మా నాయక్ వంటి అమర యోధులకు శిరసాభివందనం చేస్తున్నాం” అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.