జమైకా ప్రధాని హెచ్.ఇ డాక్టర్. ఆండ్రూ హోల్నెస్ అధికారిక భారత పర్యటన సందర్భంగా (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు) జరిగిన ఒప్పందాలు
October 01st, 12:30 pm
ఆర్థిక సేవలు, ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచడం, సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించే లక్ష్యంతో విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకునే విషయంలో పరస్పర సహకారంపై భారత్, జమైకా ప్రభుత్వాల తరపున భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, జమైకా ప్రధాన మంత్రి కార్యాలయం మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.జమైకా ప్రధానితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 01st, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్‌కు స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. అందుకే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యముంది. చాలా కాలంగా ప్రధాని హోల్నెస్ భారతదేశానికి మిత్రులుగా కొనసాగుతున్నారు. చాలా సార్లు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయనను కలిసిన ప్రతిసారీ భారత్‌తో సంబంధాల బలోపేతం పట్ల ఆయనకు గల నిబద్ధతను ఆయన ఆలోచనల ద్వారా నేను గ్రహించాను. ఆయన పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం కరీబియన్ ప్రాంతంతో మన బంధాన్ని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి అభినందనలు తెలిపిన జమైకా ప్రధాని
July 04th, 08:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమైకా ప్రధాని మాన్య శ్రీ ఏండ్ర్ యూ మాయికల్ హోనెస్ టెలిఫోన్ లో మాట్లాడి, శ్రీ మోదీ యొక్క పార్టీ చరిత్రాత్మకమైన ఎన్నికల విజయాన్ని సాధించినందుకు గాను ఆయన కు అభినందనల ను తెలియజేశారు.