జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న అమరులైన వారికి శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి

April 13th, 10:41 am

జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న ప్రాణ సమర్పణం చేసిన వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. జాలియాంవాలా బాగ్ స్మారక భవన సముదాయాన్ని పునర్ నవీకరించిన అనంతరం కిందటి సంవత్సరం లో ఆ స్మారకాన్ని ప్రారంభించిన కార్యక్రమం లో తాను చేసిన ప్రసంగాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 23rd, 06:05 pm

పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్‌ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

March 23rd, 06:00 pm

“విప్లవ భారత్‌ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ శ్రీ జగ్ దీప్‌ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్‌ రెడ్డి పాల్గొన్నారు.

గతంలోని భయానక పరిస్థితులను ఏ దేశమూ విస్మరించడం సరికాదు: ప్రధాని మోదీ

August 28th, 08:48 pm

జలియన్‌వాలా బాగ్ స్మారక్ యొక్క పునర్నిర్మించిన సముదాయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జలియన్ వాలా బాగ్ భారతదేశ స్వాతంత్య్రం కోసం చనిపోవడానికి లెక్కలేనన్ని విప్లవకారులను మరియు సర్దార్ ఉద్ధమ్ సింగ్, సర్దార్ భగత్ సింగ్ వంటి పోరాటయోధులను ప్రేరేపించిన ప్రదేశం అని ప్రధాని అన్నారు. ఏప్రిల్ 13, 1919 యొక్క ఆ 10 నిమిషాలు మన స్వాతంత్ర్య పోరాటంలోని అమర కథగా మారాయని, ఈ కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ యొక్క అమృత్ మహోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.

పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

August 28th, 08:46 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మారకం వద్ద ఏర్పాటుచేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఉన్నతీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా వీరభూమి పంజాబ్‌తోపాటు పవిత్రమైన జలియన్‌వాలా బాగ్‌ ప్రాంగణానికి శిరసాభివందనం చేశారు. స్వేచ్ఛా జ్వాలలను ఆర్పివేయడం కోసం పరాయి పాలకుల అనూహ్య అమానుష హింసాకాండకు గురైన భరతమాత బిడ్డలకు ఆయన సగౌరవ వందనం సమర్పించారు.

పునర్నిర్మించిన జలియన్‌వాలా బాగ్ స్మారక్ నుండి సంగ్రహావలోకనం

August 27th, 07:38 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 28, శనివారం నాడు జలియన్ వాలా బాగ్ స్మారక్ యొక్క పునరుద్ధరించిన సముదాయాన్ని జాతికి అంకితం చేస్తారు. స్మారక్‌లో అభివృద్ధి చేసిన మ్యూజియం గ్యాలరీలను ఆయన ప్రారంభిస్తారు. కాంప్లెక్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న బహుళ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది.

పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని ఆగస్టు 28న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

August 26th, 06:51 pm

పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 28న సాయంత్రం 6:25 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు స్మారకం వద్ద నిర్మించిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాంగణం నవీకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి.