జ‌ల్ జీవ‌న్ మిశన్ ను గురించి గ్రామ‌ పంచాయ‌తీల తో, పానీ స‌మితుల‌ తో మాట్లాడిన సందర్భంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 02nd, 02:57 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్జీ, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ జీ, శ్రీ బిశ్వేశ్వర్ తుదు జీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీసభ్యులు, పానీ సమితితో సంబంధం ఉన్న సభ్యులు,మరియు దేశంలోని ప్రతి మూలలో ఈ కార్యక్రమంతో సంబంధం కలిగి ఉన్నారు.

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ పై గ్రామ‌ పంచాయ‌తీలు, పానీ స‌మితుల‌తో ప్ర‌ధాన‌మంత్రి సంభాష‌ణ

October 02nd, 01:13 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గ్రామ‌పంచాయ‌తీలు, పానీ స‌మితులు/ గ్రామ నీటి, పారిశుధ్య క‌మిటీల (విడ‌బ్ల్యుఎస్ సి) స‌భ్యుల‌తో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ పై వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా సంభాషించారు. ఇందులో భాగ‌స్వాములైన అంద‌రిలో చైత‌న్యం పెంచేందుకు; ఈ కార్య‌క్ర‌మం కింద ప‌థ‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త‌, బాధ్య‌తాయుత వైఖ‌రి పెంచేందుకు జ‌ల్ జీవ‌న్ మిష‌న్ యాప్ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. దానితో పాటుగా రాష్ర్టీయ జ‌ల్ జీవ‌న్ కోశ్ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ప్ర‌తీ ఒక్క గ్రామీణ గృహం, పాఠ‌శాల‌, అంగ‌న్ వాడీ కేంద్రం, ఆశ్ర‌మ‌శాల‌, ఇత‌ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు టాప్ ల ద్వారా నీటి క‌నెక్ష‌న్ అందించేందుకు వ్య‌క్తులు, సంస్థ‌లు, కార్పొరేష‌న్లు లేదా దాత‌లు ఈ కోశ్ ద్వారా విరాళాలు అందించ‌వ‌చ్చు. గ్రామ పంచాయ‌తీలు, పానీ స‌మితుల స‌భ్యుల‌తో పాటు కేంద్ర మంత్రులు శ్రీ గ‌జేంద్ర సింగ్ షెఖావ‌త్‌, శ్రీ ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్‌, శ్రీ భువ‌నేశ్వ‌ర్ తుడు, రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీలు, పానీ సమితీల తో జల్ జీవన్ మిశన్ అంశం పై అక్టోబరు 2న సమావేశం కానున్న ప్రధాన మంత్రి

October 01st, 12:23 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 2న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా గ్రామ పంచాయతీ లు, పానీ సమితులు/ విలేజ్ వాటర్ ఎండ్ శానిటేశన్ కమిటీస్ (విడబ్ల్యుఎస్ సి) తో సమావేశం కానున్నారు.