Prime Minister meets with the President of the Islamic Republic of Iran

October 22nd, 09:24 pm

PM Modi met Iran's President Dr. Masoud Pezeshkian on the sidelines of the 16th BRICS Summit in Kazan. PM Modi congratulated Pezeshkian on his election and welcomed Iran to BRICS. They discussed strengthening bilateral ties, emphasizing the Chabahar Port's importance for trade and regional stability. The leaders also addressed the situation in West Asia, with PM Modi urging de-escalation and protection of civilians through diplomacy.

ఇరాన్ అధ్యక్షుని తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ

November 06th, 06:14 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయ్యద్ ఇబ్రాహిమ్ రయీసీ తో ఈ రోజు న టెలిఫోన్ మాధ్యం ద్వారా సంభాషించారు.

బ్రిక్స్ విస్తరణపై ప్రధానమంత్రి ప్రకటన

August 24th, 01:32 pm

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రప్రథమంగా నా మిత్రుడు, అధ్యక్షుడు రమఫోసాను నేను హృద‌యపూర్వకంగా అభినందిస్తున్నాను. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు సందర్భంగా అనేక సానుకూల ఫలితాలు రావడం నాకు ఆనందంగా ఉంది.

ఇరాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశాధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ సయ్యద్‌ ఇబ్రహీం రైజీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

August 18th, 06:07 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఇరాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశాధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ సయ్యద్‌ ఇబ్రహీం రైజీతో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ అనేక ద్వైపాక్షిక, ప్రాంతీయ ప్రాధాన్యాంశాలపై చర్చించారు. భారత-ఇరాన్‌ల మధ్య బలమైన స్నేహసంబంధాలకు చారిత్రక, నాగరికతాపరమైన సాన్నిహిత్యంతోపాటు ప్రజల మధ్యగల బలమైన బంధం మద్దతునిచ్చాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 04th, 12:30 pm

ఈ రోజు న జరుగుతున్న ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాని కి మీ అందరికి ఇదే స్నేహపూర్వక స్వాగతం. గడచిన రెండు దశాబ్దాలు గా యావత్తు ఆసియా ప్రాంతం లో శాంతి కి, సమృద్ధి కి మరియు అభివృద్ధి కి ఎస్ సిఒ ఒక ముఖ్యమైన వేదిక గా ఉంటున్నది. ఈ ప్రాంతాని కి మరియు భారతదేశాని కి మధ్య వేల సంవత్సరాలు గా సాంస్కృతిక సంబంధాలు మరియు ఉభయ పక్షాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఏర్పడి అవి మన యొక్క ఉమ్మడి వారసత్వాని కి ఒక సజీవ తార్కాణం గా నిలచాయి. మనం ఈ ప్రాంతాన్ని ‘‘విస్తారిత ఇరుగు పొరుగు బంధం’’ గా చూడం, మనం దీనిని ‘‘విస్తారిత కుటుంబం’’ లా ఎంచుతున్నాం.

ఐటీయూ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 22nd, 03:34 pm

ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. నేటి నుంచి 'హిందూ క్యాలెండర్' నూతన సంవత్సరం ప్రారంభమైంది. మీ అందరికీ, దేశ ప్రజలందరికీ విక్రమ్ సంవత్ 2080 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత సువిశాలమైన మన దేశంలో, భిన్నత్వంతో నిండిన దేశంలో, శతాబ్దాలుగా వేర్వేరు క్యాలెండర్లు ప్రబలంగా ఉన్నాయి. కొల్లం కాలానికి చెందిన మలయాళ క్యాలెండర్, తమిళ క్యాలెండర్, ఇది వందల సంవత్సరాలుగా భారతదేశానికి తిథి జ్ఞానాన్ని ఇస్తోంది. విక్రమ్ సంవత్ కూడా 2080 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2023 సంవత్సరం జరుగుతుండగా, విక్రమ్ సంవత్ అంతకు ముందు 57 సంవత్సరాలు గా ఉంది. కొత్త సంవత్సరం మొదటి రోజున, టెలికాం, ఐసిటి మరియు సంబంధిత ఆవిష్కరణలకు సంబంధించి భారతదేశంలో చాలా పెద్ద ప్రారంభం జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఏరియా ఆఫీస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)కు చెందిన ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 6జీ టెస్ట్ బెడ్ ను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ సాంకేతికటకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఇది డిజిటల్ ఇండియాకు కొత్త శక్తిని ఇస్తుంది, అలాగే దక్షిణాసియా, గ్లోబల్ సౌత్ కోసం కొత్త పరిష్కారాలు, కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తుంది. ఇది ముఖ్యంగా మన విద్యారంగానికి, మన ఆవిష్కర్తలకు-స్టార్టప్ లకు, మన పరిశ్రమకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

ఐ.టి.యు. ప్రాంతీయ కార్యాలయం, ఆవిష్కరణల కేంద్రాన్ని ప్రారంభించిన - ప్రధానమంత్రి

March 22nd, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారతదేశంలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ.టి.యు) కు చెందిన ఏరియా కార్యాలయంతో పాటు, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. భారత్ 6-జి విజన్ డాక్యుమెంట్‌ ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు, 6-జి ఆర్.&డి. టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ‘కాల్-బి-ఫోర్-యు-డిగ్’ అనే యాప్‌ ను కూడా ఆయన ప్రారంభించారు. ఐ.టి.యు. అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీల (ఐ.సి.టి.ల) ప్రత్యేక ఏజెన్సీ. ఏరియా కార్యాలయం ఏర్పాటు కోసం 2022 మార్చి నెలలో ఐ.టి.యు. తో భారతదేశం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ దేశాలకు ఈ కార్యాలయం సేవలందిస్తుంది, దేశాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ కార్యాలయం ప్రోత్సహిస్తుంది.

ఐటియు ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను మార్చి నెల 22 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

March 21st, 04:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 22 వ తేదీ మధ్యాహ్నం పూట 12:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమం లో పాల్గొని, నూతన ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ (ఐటియు) ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, భారత్ 6జి విజన్ డాక్యుమెంటు ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. అలాగే, 6జి కి చెందినటువంటి ఆర్&డి టెస్ట్ బెడ్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ‘కాల్ బిఫోర్ యు డిగ్’ అనే ఏప్ ను సైతం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.

కునో నేషనల్ పార్క్‌ లో చీతాల (చిరుతపులులలో ఒక రకం) విడుదల వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 17th, 11:51 am

గతాన్ని సరిదిద్దడానికి, కొత్త భవిష్యత్తును నిర్మించడానికి కాలచక్రం మనకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా అరుదుగా మానవాళి అటువంటి సందర్భాలను ఎదుర్కొంటుంది. అదృష్టవశాత్తూ, ఈ రోజు మన ముందు అలాంటి ఒకట క్షణం ఉంది. దశాబ్దాల క్రితం విచ్ఛిన్నమై, అంతరించిపోయిన జీవవైవిధ్యం యొక్క పురాతన బంధాన్ని మళ్లీ కనెక్ట్ చేసే అవకాశం నేడు మనకు లభించింది. నేడు చిరుతలు భారత గడ్డపైకి తిరిగి వచ్చాయి. మరియు ఈ చిరుతలతో పాటు, భారతదేశంలోని ప్రకృతిని ప్రేమించే స్పృహ కూడా పూర్తి శక్తితో మేల్కొల్పబడిందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశప్రజలందరికీ నా అభినందనలు.

PM addresses the nation on release of wild Cheetahs in Kuno National Park in Madhya Pradesh

September 17th, 11:50 am

PM Modi released wild Cheetahs brought from Namibia at Kuno National Park under Project Cheetah, the world's first inter-continental large wild carnivore translocation project. PM Modi said that the cheetahs will help restore the grassland eco-system as well as improve the biopersity. The PM also made special mention of Namibia and its government with whose cooperation, the cheetahs have returned to Indian soil after decades.

ఎస్ సిఒ శిఖర సమ్మేళనం సందర్భం లోఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 16th, 11:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇరాన్ ఇస్లామిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ రయీసీ లు ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఎస్ సిఒ యొక్క దేశాధినేతల మండలి 22వ సమావేశం జరిగిన సందర్భం లో సమావేశమయ్యారు. 2021వ సంవత్సరం లో అధ్యక్షుడు శ్రీ రయీసీ పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత, ప్రధాన మంత్రి మరియు అధ్యక్షుడు శ్రీ రయీసీ లు సమావేశం కావడం ఇదే తొలి సారి.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

June 08th, 07:53 pm

భారతదేశాని కి ఆధికారిక యాత్ర నిమిత్తం విచ్చేసిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హుసైన్ అమీరబ్దొల్లాహియాన్ ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మర్యాద పూర్వకం గా సమావేశమయ్యారు.

“ఆఫ్ఘ‌నిస్తాన్ పై ఢిల్లీ ప్రాంతీయ భ‌ద్ర‌తా చ‌ర్చ‌ల”‌కు హాజ‌రైన సంద‌ర్భంగా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారులు/ భ‌ద్ర‌తా కౌన్సిళ్ల కార్య‌ద‌ర్శులు ఉమ్మ‌డిగా ప్ర‌ధాన‌మంత్రితో భేటీ

November 10th, 07:53 pm

భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు శ్రీ అజిత్ దోవ‌ల్ ఢిల్లీలో నిర్వ‌హించిన‌ ఆఫ్ఘ‌నిస్తాన్ పై ప్రాంతీయ భ‌ద్ర‌తా గోష్ఠిలో పాల్గొన్న ఏడు దేశాల‌కు చెందిన జాతీయ భ‌ద్ర‌తా కౌన్సిళ్ల అధిప‌తులు త‌మ చ‌ర్చ‌ల అనంత‌రం ఉమ్మ‌డిగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు.

ఎస్ సిఒదేశాధినేతల మండలి 21వ సమావేశం తాలూకు సర్వ సభ్య సదస్సు లోప్రధాన మంత్రి ప్రసంగం

September 17th, 12:22 pm

అన్నింటి కంటే ముందు, ఎస్ సిఒ కౌన్సిల్ అధ్యక్ష పదవి లో సఫలత ను పొందినందుకు అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు నన్ను అభినందనల ను తెలియజేయనివ్వండి. ప్రాంతీయ స్థితిగతులు , ప్రపంచ స్థితిగతులు చాలా సవాళ్ళ తో నిండిపోయిన నేపథ్యం లో తాజిక్ అధ్యక్షత న ఈ సంస్థ ను సమర్థం గా నడపడం జరిగింది. తాజికిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత 30వ వార్షికోత్సవం కూడా ఇదే సంవత్సరం లో జరుగుతున్నది. ఈ వేళ లో తాజిక్ సోదరుల కు, సోదరీమణుల కు, అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు భారతదేశం తరఫు న నేను నా హృదయ పూర్వక అభినందనల ను, శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.

ఇరాన్ అధ్య‌క్షుడిగా ఎన్నికైనందుకు హిజ్ ఎక్స‌లెన్సీ ఇబ్ర‌హిమ్ రెయిసికి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 20th, 02:06 pm

ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్‌ ఇరాన్ అధ్య‌క్షుడిగా ఎన్నికైనందుకు హిజ్ ఎక్స‌లెన్సీ ఇబ్ర‌హిమ్ రెయిసికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

PM Modi's bilateral meetings on the margins of UNGA in New York

September 26th, 11:27 pm

PM Modi held bilateral talks with leaders from several countries in the sidelines of the UNGA in New York.

సోషల్ మీడియా కార్నర్ 18 ఫెబ్రవరి 2018

February 18th, 08:45 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ఇరాన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-ఇరాన్ సంయుక్త ప్రకటన (2018 ఫిబ్రవరి 17)

February 17th, 07:14 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇరాన్ అధ్యక్షుడు మాననీయ డాక్టర్ హసన్ రౌహానీ 2018 ఫిబ్రవరి 15 నుంచి 17వ తేదీవరకు తొలిసారి భారతదేశంలో పర్యటించారు.

ఇరాన్ అధ్యక్షుల వారి భారతదేశం పర్యటన (2018 ఫిబ్రవరి 17) సందర్భంగా

February 17th, 02:56 pm

ఇరాన్ అధ్యక్షుల వారి భారతదేశం పర్యటన (2018 ఫిబ్రవరి 17) సందర్భంగా

ఇరాన్ అధ్యక్షుడు దేశ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పత్రికాప్రకటన

February 17th, 02:23 pm

ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో ఉమ్మడి పత్రికా ప్రకటనలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పురాతన కాలం నుంచి భారతదేశం మరియు ఇరాన్ మంచి సంబంధాలు కలిగిఉన్నాయని అన్నారు. ఇరువురు నాయకులు వాస్తవమైన మరియు ఉత్పాదక చర్చ జరిపారు. వాణిజ్యం మరియు పెట్టుబడి, ఇంధనం, అనుసంధానత, రక్షణ మరియు భద్రత మరియు ప్రాంతీయ సమస్యలపై సహకారానన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి.