స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ
December 09th, 07:38 pm
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 06th, 12:31 pm
స్వామిత్వ పథకం ద్వారా గ్రామాల్లో సృష్టించబడిన విశ్వాసం, నమ్మకం లబ్ధిదారులతో సంభాషణలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. మీరు మీ వెదురు కుర్చీలను చూపించారు కానీ ప్రజల ఉత్సాహంపై నా దృష్టి నిలిచింది. ప్రజల నుండి ఎంతో ప్రేమ మరియు ఆశీర్వాదాలతో, ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే సంక్షేమ ప్రయోజనాలను నేను స్పష్టంగా ఊహించగలను. నాకు కొందరు సహచరులతో మాట్లడే అవకాశం లభించిన తరువాత, వారు ఇచ్చిన వివరణాత్మక సమాచారంలో ఈ ప్రణాళిక ఎలా గొప్ప శక్తిగా ఎదుగుతుందో నేను సవిస్తరంగా పంచుకున్న అనుభవాలు తెలియజేస్తున్నాయి. స్వమిత్వా పథకం ప్రారంభించిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ప్రజలకు సులభమైంది.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
October 06th, 12:30 pm
మధ్య ప్రదేశ్ లోని ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఇదే కార్యక్రమం లో 1,71,000 మంది లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టి కార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, లబ్ధిదారులు, గ్రామాల అధికారులు, జిల్లాల అధికారుల తో పాటు రాష్ట్రం అధికారులు కూడా పాలుపంచుకొన్నారు.శిక్షక్ పర్వ్ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 07th, 10:31 am
మంత్రి వర్గంలో నా సహద్యోగి శ్రీ ధర్మేంద్ర ప్రధాంజీ, శిక్షక్ పర్వ్ (శిక్ష క్ పర్వ్) అనే ఈ కీలక కార్య క్ర మంలో మాతో క లుసుకుంటున్నాను. అన్నపూర్ణా దేవి గారు, డాక్టర్ సుభాష్ సర్కార్ గారు, డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ గారు, దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యా శాఖ గౌరవనీయ మంత్రి గానా, జాతీయ విద్యా విధానం నమూనాను తయారు చేయడానికి కమిటీ అధ్యక్షుడు, డాక్టర్ కస్తూరి రంగంజీ, ఆమె బృందంలోని గౌరవనీయ గౌరవనీయ సభ్యులు, దేశం నలుమూలల నుండి మాతో ఉన్న అన్ని నేర్చుకున్న ప్రచారగణాలు, ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులు!‘శిక్షక్పర్వ్’ ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి; విద్య రంగం లో అనేక మహత్వపూర్ణ పథకాల ను ఆయన ప్రారంభించారు
September 07th, 10:30 am
‘శిక్షక్ పర్వ్’ తాలూకు ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఆయన భారతీయ సంజ్ఞా భాషా నిఘంటువు (వినికిడి లోపం ఉన్నవారి కి యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ కు అనుగుణం గా ఆడియో మరియు టెక్స్ ట్ ఎంబెడెడ్ సంజ్ఞ భాష వీడియో) ను, మాట్లాడే పుస్తకాలు (దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందినటువంటి ఆడియో బుక్స్) ను, సిబిఎస్ఇ యొక్క స్కూల్ క్వాలిటీ అశ్యోరన్స్ ఎండ్ అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్ ను, ‘నిపుణ్ భారత్’ కు ఉద్దేశించినటువంటి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం అయిన ‘నిష్ఠ’ ను, విద్యాంజలి పోర్టల్ ను (పాఠశాల అభివృద్ధి కి విద్య వాలంటియర్ లు/ దాత లు/ సిఎస్ఆర్ సహకారాన్ని సులభతరం చేయడం కోసం ఉద్దేశించింది) కూడా ప్రారంభించారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:02 pm
నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 15th, 07:38 am
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:37 am
దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.మా ప్రభుత్వ సంస్కరణలు నిర్బంధానికి సంబంధించినవి, బలవంతం కాదు: ప్రధాని మోదీ
August 11th, 06:52 pm
2021 భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధి మరియు సామర్థ్యాల కోసం విశ్వాస వాతావరణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ పరిశ్రమను కోరారు. ప్రస్తుత ప్రభుత్వ విధానంలో మార్పులు మరియు ప్రస్తుత సెటప్ యొక్క పని విధానాలలో మార్పులను గమనించిన ప్రధాన మంత్రి, ఈ రోజు కొత్త భారతదేశం కొత్త ప్రపంచంతో కవాతు చేయడానికి సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు.భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) వార్షిక సమావేశం - 2021 లో ప్రసంగించిన - ప్రధానమంత్రి
August 11th, 04:30 pm
ఈ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆజాదీ-కా-అమృత్ మహోత్సవ్ మధ్యలో జరుగుతోందని అన్నారు. భారతీయ పరిశ్రమ యొక్క కొత్త తీర్మానాలు మరియు కొత్త లక్ష్యాల కోసం ఇది ఒక గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు. ఆత్మా నిర్భర్ భారత్ ప్రచారం విజయవంతం కావడానికి ప్రధాన బాధ్యత భారతీయ పరిశ్రమలపై ఉందని ఆయన అన్నారు. మహమ్మారి సమయంలో పరిశ్రమల రంగం స్థిరంగా నిలబడినందుకు ప్రధాన మంత్రి ప్రశంసించారు.మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం
August 07th, 10:55 am
మధ్యప్రదేశ్ గవర్నర్, నా పాత సహచరుడు శ్రీ మంగుభాయ్ పటేల్, గిరిజన సమాజ శ్రేయస్సు కోసం, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తన జీవితమంతా గడిపారు. ఆయనే మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులందరూ !మధ్యప్రదేశ్‌లోని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పిఎంజికెకెవై) లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి
August 07th, 10:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు , మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముచ్చటించారు. ఈ పథకానికి సంబంధించిచచ అర్హులైన వారెవరికీ ఈ పథకం ఫలాలు అందని పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు ఈ పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున అవగాహనకార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టనుంది. 2021 ఆగస్టు 7ను రాష్ట్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు.మధ్యప్రదేశ్‌లో ఈ పథకం కింద 5 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.ఇ-రూపి అనేది ఒక వ్యక్తి అలాగే ప్రయోజన-నిర్దిష్ట చెల్లింపు వేదిక: ప్రధాని మోదీ
August 02nd, 04:52 pm
డిజిటల్ చెల్లింపు వ్యవస్థ కోసం నగదు రహిత మరియు కాంటాక్ట్‌లెస్ పరికరం ఇ-రూపిని ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త ప్లాట్‌ఫారమ్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం డిబిటి పథకాన్ని బలోపేతం చేయడంలో ఇ-రూపి వోచర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. అందరికీ లక్ష్యంగా, పారదర్శకంగా మరియు లీకేజీ లేని డెలివరీకి ఇ-రూపి సహాయపడుతుందని ఆయన అన్నారు.డిజిటల్మాధ్యమం ద్వారా చెల్లింపుల సాధనం అయినటువంటి ‘ఇ-రూపీ’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 02nd, 04:49 pm
ఒక వ్యక్తి కి మరియు ఒక ప్రయోజనానికి ప్రత్యేకంగా రూపొందిన డిజిటల్ చెల్లింపు సాధనం అయినటువంటి ‘ఇ-రుపీ’ (e-RUPI) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ‘ఇ- రుపీ’ అనేది నగదు రహితమైనటువంటి, ఇచ్చి పుచ్చుకోవడం భౌతికం గా చేయనక్కరలేనటువంటి ఒక సాధనం.‘వివా టెక్’ 5వ విడత సదస్సులో ప్రధానమంత్రి కీలకో ప్రసంగ పాఠం
June 16th, 04:00 pm
ఎక్కడ సంప్రదాయకత విఫలమవుతుందో అక్కడ ఆవిష్కరణ తోడ్పాటునిస్తుందన్నది నా విశ్వాసం. మన శకంలో అత్యంత విచ్ఛిన్నకర కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విజృంభణ సమయంలో ఈ సత్యం ప్రస్ఫుటమైంది. అన్నిదేశాలూ అనేక కష్టనష్టాలకు లోనుకావడమేగాక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మన సంప్రదాయక విధానాలకు కోవిడ్-19 విషమ పరీక్ష పెట్టినప్పటికీ, ఆవిష్కరణలే మనను ఆదుకున్నాయి.వివాటెక్ 5 వ ఎడిషన్ లో కీలకోపన్యాసం చేసిన - ప్రధానమంత్రి
June 16th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వివాటెక్ 5వ ఎడిషన్‌లో, దృశ్య మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఐరోపాలో అతిపెద్ద డిజిటల్ మరియు అంకురసంస్థల కార్యక్రమాల్లో ఒకటిగా నిర్వహిస్తున్న, వివాటెక్-2021 లో కీలకోపన్యాసం చేయడానికి ప్రధానమంత్రి ని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. 2016 నుండి ప్రతి సంవత్సరం పారిస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఎఐయు) 95వ సమావేశం మరియు వైస్ చాన్స్ లర్ ల జాతీయ చర్చాసభ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 14th, 10:25 am
ఈ కార్యక్రమం లో నాతో పాటు పాల్గొన్న గుజరాత్ గవర్నర్ ఆచార్య శ్రీ దేవ్ వ్రత్ గారు, దేశ విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్ రియాల్ నిశంక్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ గారు, గుజరాత్ విద్యా శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర సింహ్ గారు, యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ డి.పి. సింహ్ గారు, బాబా సాహెబ్ అంబేడ్ కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ అమీ ఉపాధ్యాయ్ గారు, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్- ఎఐయు ప్రెసిడెంట్ ప్రొఫెసర్ తేజ్ ప్రతాప్ గారు , ఇక్కడ ఉన్న అందరు మహానుభావులు మరియు సహచరులారా,భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం 95వ వార్షికోత్సవం.. ఉప-కులపతుల జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 10:24 am
భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) 95వ వార్షికోత్సవం... ఉప-కులపతుల జాతీయ సదస్సులనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జీవితంపై శ్రీ కిషోర్ మక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో గుజరాత్ గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు కేంద్ర-రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాలను నిర్వహించింది. ‘భారతరత్న’ బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్‌కు దేశం తరఫున, ప్రజల తరఫున ప్రధానమంత్రి ఘనంగా నివాళి అర్పించారు. భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రస్తుత సమయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు కూడా చేసుకోవడం మనకు కొత్త శక్తినిస్తుందని ఆయన అన్నారు.శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ జయంతి (ప్రకాష్ పూరబ్) నిర్వహణకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
April 08th, 01:31 pm
సమావేశానికి హాజరైన గౌరవనీయ కమిటీ సభ్యులు, సహచరులారా! గురు తేగ్ బహదూర్ గారి 400వ జయంతి (ప్రకాష్ పూరబ్) నిర్వహించే ఈ సందర్భం ఒక ఆధ్యాత్మిక గౌరవంతో కూడినది మాత్రమేగాక ఇది మన జాతీయ కర్తవ్యం. దీనికి సంబంధించి మనవంతు పాత్ర పోషించడం గురుకృపా ప్రసాదమే. ఈ కృషిలో భాగంగా మనం దేశ పౌరులందర్నీ భాగస్వాములను చేయడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జయంతి (ప్రకాశ్ పర్వ్) ను స్మరించుకోవడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
April 08th, 01:30 pm
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జయంతి (ప్రకాశ్ పర్వ్) ను స్మరించుకోవడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గురువారం నాడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించడమైంది.