ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ – వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన పారిశ్రామికవేత్తలు

October 15th, 02:23 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ - వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ) - 2024 సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎనిమిదో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. డబ్ల్యుటిఎస్ఎ అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రామాణికీకరణ కార్యకలాపాలకు పాలక వర్గ సమావేశం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ సదస్సును ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో- భారతదేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది టెలికాం, డిజిటల్, ఐసిటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 190 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా పారిశ్రామిక నాయకులు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చిన ఒక కీలకమైన అంతర్జాతీయ సదస్సు.

ఐటీయూ - వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 10:05 am

నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా జీ, చంద్రశేఖర్ జీ, ఐటీయూ సెక్రటరీ జనరల్, వివిద దేశాల మంత్రులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, పరిశ్రమ ముఖ్యులు, టెలికాం నిపుణులు, అంకుర సంస్థలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు, భారత్, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,

న్యూఢిల్లీలో ‘ఐటియు’ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

October 15th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటియు)- వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 (డబ్ల్యుటిఎస్ఎ) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) 8వ మహాసభకూ ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.

అక్టోబర్ 15న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ద్వారా

October 14th, 05:31 pm

న్యూఢిల్లీ భారత మండపంలో అక్టోబర్ 15, ఉదయం 10 గంటలకు ‘అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) - ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ ప్రామాణీకరణ సభ (డబ్ల్యూటీఎస్ఏ)’ సమావేశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024’ 8వ సంచికను సైతం ప్రధాని ప్రారంభిస్తారు.

తమిళనాడు.. లక్షద్వీప్ దీవులలో 2024 జనవరి 2-3 తేదీల్లో ప్రధానమంత్రి పర్యటన

December 31st, 12:56 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జనవరి 2, 3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ దీవులలో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 2వ తేదీన ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి చేరుకుంటారు. అక్కడ భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో నగరంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పౌర విమానయానం, రైలు, రోడ్డు, చమురు-గ్యాస్, ఉన్నత విద్యా రంగాలకు చెందిన రూ.19,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.

గుజరాత్ లో స్వాగత్ కు 20 సంవత్సరాలు పూర్తైన సంద ర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ముఖాముఖి ప్రసంగం

April 27th, 04:32 pm

మీరు నేరుగా నాతో కమ్యూనికేట్ చేస్తారు. పాతకాలపు మిత్రులను కలుసుకోగలగడం నా అదృష్టం. ముందు ఎవరెవరికి మాట్లాడే అవకాశం దక్కుతుందో చూడాలి.

ఇంటర్నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ సెక్రట్రి జనరల్ డోరీన్ బోగ్ డాన్ -మార్టిన్ తో సమావేశమైన ప్ర‌ధాన మంత్రి

March 24th, 08:28 am

ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ సెక్రట్రి జనరల్ డోరీన్ బోగ్ డాన్- మార్టిన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఒక మెరుగైనటువంటి మరియు సుదీర్ఘకాలం పాటు మనుగడ లో ఉండేటటువంటి భూ గ్రహం కోసం డిజిటల్ టెక్నాలజీ ని సద్వినియోగ పరచుకోవడం అనే అంశం పై ఈ ఉన్నతాధికారులు ఇరువురు విస్తృతం గా చర్చించారు.

ఐటీయూ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 22nd, 03:34 pm

ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. నేటి నుంచి 'హిందూ క్యాలెండర్' నూతన సంవత్సరం ప్రారంభమైంది. మీ అందరికీ, దేశ ప్రజలందరికీ విక్రమ్ సంవత్ 2080 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత సువిశాలమైన మన దేశంలో, భిన్నత్వంతో నిండిన దేశంలో, శతాబ్దాలుగా వేర్వేరు క్యాలెండర్లు ప్రబలంగా ఉన్నాయి. కొల్లం కాలానికి చెందిన మలయాళ క్యాలెండర్, తమిళ క్యాలెండర్, ఇది వందల సంవత్సరాలుగా భారతదేశానికి తిథి జ్ఞానాన్ని ఇస్తోంది. విక్రమ్ సంవత్ కూడా 2080 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2023 సంవత్సరం జరుగుతుండగా, విక్రమ్ సంవత్ అంతకు ముందు 57 సంవత్సరాలు గా ఉంది. కొత్త సంవత్సరం మొదటి రోజున, టెలికాం, ఐసిటి మరియు సంబంధిత ఆవిష్కరణలకు సంబంధించి భారతదేశంలో చాలా పెద్ద ప్రారంభం జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఏరియా ఆఫీస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)కు చెందిన ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 6జీ టెస్ట్ బెడ్ ను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ సాంకేతికటకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఇది డిజిటల్ ఇండియాకు కొత్త శక్తిని ఇస్తుంది, అలాగే దక్షిణాసియా, గ్లోబల్ సౌత్ కోసం కొత్త పరిష్కారాలు, కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తుంది. ఇది ముఖ్యంగా మన విద్యారంగానికి, మన ఆవిష్కర్తలకు-స్టార్టప్ లకు, మన పరిశ్రమకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

ఐ.టి.యు. ప్రాంతీయ కార్యాలయం, ఆవిష్కరణల కేంద్రాన్ని ప్రారంభించిన - ప్రధానమంత్రి

March 22nd, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారతదేశంలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ.టి.యు) కు చెందిన ఏరియా కార్యాలయంతో పాటు, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. భారత్ 6-జి విజన్ డాక్యుమెంట్‌ ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు, 6-జి ఆర్.&డి. టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ‘కాల్-బి-ఫోర్-యు-డిగ్’ అనే యాప్‌ ను కూడా ఆయన ప్రారంభించారు. ఐ.టి.యు. అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీల (ఐ.సి.టి.ల) ప్రత్యేక ఏజెన్సీ. ఏరియా కార్యాలయం ఏర్పాటు కోసం 2022 మార్చి నెలలో ఐ.టి.యు. తో భారతదేశం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ దేశాలకు ఈ కార్యాలయం సేవలందిస్తుంది, దేశాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ కార్యాలయం ప్రోత్సహిస్తుంది.

ఐటియు ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను మార్చి నెల 22 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

March 21st, 04:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 22 వ తేదీ మధ్యాహ్నం పూట 12:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమం లో పాల్గొని, నూతన ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ (ఐటియు) ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, భారత్ 6జి విజన్ డాక్యుమెంటు ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. అలాగే, 6జి కి చెందినటువంటి ఆర్&డి టెస్ట్ బెడ్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ‘కాల్ బిఫోర్ యు డిగ్’ అనే ఏప్ ను సైతం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.