గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం
November 21st, 02:00 am
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై జి20 కార్యక్రమం; ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం
November 20th, 01:40 am
ఈ రోజు కార్యక్రమానికి ఎంపిక చేసుకొన్న ఇతివృత్తం చాలా సందర్భ శుద్ధిగలదీ, తరువాతి తరం భవిష్యత్తుతో ముడిపడిందీనూ. న్యూ ఢిల్లీలో ఇదివరకు జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించినప్పుడు, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీస్) ను త్వరితగతిన సాధించడానికి ‘వారణాసి కార్యచరణ ప్రణాళిక’ను మనం ఆమోదించాం.స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 20th, 01:34 am
స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. జి20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇది వరకు న్యూఢిల్లీలో నిర్వహించినప్పుడు 2030కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు, ఇంధన సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జి20 తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు. స్థిరాభివృద్ధి సాధనకు సంబంధించిన ఈ ప్రాథమ్యాలను ముందుకు తీసుకు పోవాలని బ్రెజిల్ నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు.నైజీరియా అధ్యక్షునితో అధికారిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి
November 17th, 06:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 17, 18 తేదీల్లో తన నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో అబుజాలో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు. స్టేట్ హౌస్‌కు చేరుకున్న అనంతరం ప్రధానికి 21 తుపాకులతో గౌరవ వందనంతో లాంఛనంగా స్వాగతం పలికారు.బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 05:22 pm
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
October 23rd, 03:10 pm
బహుళవాదాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాల ఆందోళనలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై బ్రిక్స్ నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. కొత్తగా చేరిన 13 బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు నేతలు స్వాగతం పలికారు.PM Modi meets Prime Minister of Nepal
September 23rd, 06:25 am
PM Modi met PM K.P. Sharma Oli of Nepal in New York. The two leaders reviewed the unique and close bilateral relationship between India and Nepal, and expressed satisfaction at the progress made in perse sectors including development partnership, hydropower cooperation, people-to-people ties, and enhancing connectivity – physical, digital and in the domain of energy.అమెరికాలోని న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
September 22nd, 10:00 pm
నమస్తే అమెరికా! ఇప్పుడు మన నమస్తే కూడా స్థానికం నుంచి అంతర్జాతీయంగా మారిపోయింది. ఇదంతా మీ వల్లే. భారత్ ను హృదయానికి దగ్గరగా ఉంచుకునే ప్రతి భారతీయుడు దీన్ని సుసాధ్యం చేశాడు.న్యూయార్క్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
September 22nd, 09:30 pm
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారీ ఎత్తున హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి సోమవారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15,000 మంది ప్రజలు హాజరయ్యారు.సురక్షితమైన అంతర్జాతీయ స్వచ్ఛ ఇంధన సరఫరా వ్యవస్థల నిర్మాణం కోసం అమెరికా- భారత్ చొరవకు మార్గదర్శ ప్రణాళిక
September 22nd, 11:44 am
ఉమ్మడి జాతీయ, ఆర్థిక భద్రతకు సంబంధించిన పరస్పర అంశాలపై సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికా, భారత్ లు మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక పరమైన అజెండాలో స్వచ్ఛ ఇంధనానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రజలకు ఉన్నతోద్యోగాలను కల్పించవచ్చనీ, స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రపంచవ్యాప్తం చేయవచ్చుననీ, అంతర్జాతీయ పర్యావరణ లక్ష్యాలను అందుకోవడం కూడా సాధ్యం అవుతుందని ఇరుదేశాలూ నిర్ణయించుకున్నాయి.గుజరాత్, గాంధీనగర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
September 16th, 11:30 am
జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వచ్చిన విశిష్ట అతిథులూ , నా మంత్రి మండలి సభ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , పలు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు...గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
September 16th, 11:11 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.తొలి అంతర్జాతీయ సౌర ఉత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
September 05th, 11:00 am
గౌరవనీయ ప్రముఖులారా, విశిష్ట అతిథులారా, నా ప్రియ మిత్రులారా! మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అంతర్జాతీయ సౌరోత్సవానికి మీ అందరినీ సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి అభినందనలు.Joint Statement on India – Malaysia Comprehensive Strategic Partnership
August 20th, 08:39 pm
On 20 August 2024, the Prime Minister of Malaysia, Dato’ Seri Anwar Ibrahim visited India, accepting the kind invitation of the Prime Minister of India, Shri Narendra Modi to undertake a State Visit. This was the Malaysian Prime Minister’s first visit to the South Asian region, and the first meeting between the two Prime Ministers, allowing them to take stock of the enhanced strategic ties. The wide-ranging discussions included many areas that make India-Malaysia relations multi-layered and multi-faceted.వియత్నాం ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా (ఆగస్టు 01, 2024) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
August 01st, 12:30 pm
భారతదేశానికి విచ్చేసిన ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్, ఆయన ప్రతినిధి బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.ఆస్ట్రియా ఛాన్సలర్ తో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉమ్మడి పత్రికా ప్రకటన
July 10th, 02:45 pm
హృదయ పూర్వక స్వాగతాన్ని పలికి, ఆతిథ్యమందించినందుకు మొట్టమొదటగా ఛాన్సలర్ నెహమర్ కు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా వుంది. నా ఈ పర్యటన చారిత్రాత్మకమైనది, ప్రత్యేకమైనది. 41 సంవత్సరాల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్న భారతీయ ప్రధానిగా నాకు గుర్తింపు లభించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నేను పర్యటించడం కాకతాళీయం, సంతోషకరం.The new Nalanda University would initiate the golden age of India: PM Modi in Bihar
June 19th, 10:31 am
PM Modi inaugurated the new campus of Nalanda University at Rajgir, Bihar. “Nalanda is not just a name, it is an identity, a regard. Nalanda is the root, it is the mantra. Nalanda is the proclamation of the truth that knowledge cannot be destroyed even though books would burn in a fire,”, the PM exclaimed. He underlined that the establishment of the new Nalanda University would initiate the golden age of India.