అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో-2023 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 11:00 am
మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, మీనాక్షి లేఖి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ మాన్యువల్ రబాటే గారు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అతిథులు, ఇతర ప్రముఖులు, మహిళలు , పెద్దమనుషులు! మీ అందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు, మ్యూజియం ప్రపంచ దిగ్గజాలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నందున ఈ రోజు సందర్భం కూడా ప్రత్యేకం.ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 18th, 10:58 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.