న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం 23 సెప్టెంబరు, 2023

September 23rd, 10:59 am

ప్రపంచ న్యాయ విభాగానికి చెందిన ప్రముఖులందరినీ కలవడం, వారందరి మధ్యన ఉండే అవకాశం రావడం నాకు ఒక అద్భుతమైన అనుభవం. భారత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు నేడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడ ఉన్నారు. ఇంగ్లండ్ లార్డ్ చాన్సలర్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇంగ్లండ్ కు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు మన మధ్యన ఉన్నారు. అలాగే కామన్వెల్త్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు కూడా వచ్చారు. ఆ రకంగా నేటి ఈ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ‘‘వసుధైవ కుటుంబకం’’ (ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అనే భారత్ సెంటిమంట్ కు ఒక చిహ్నంగా నిలిచింది. భారత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంతర్జాతీయ అతిథులందరికీ హృద‌యపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమం చేపట్టే బాధ్యత హృద‌యపూర్వకంగా స్వీకరించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను.

న్యూఢిల్లీలో ‘అంతర్జాతీయ న్యాయవాద సదస్సు-2023’ను ప్రారంభించిన ప్రధానమంత్రి

September 23rd, 10:29 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ‘అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు-2023’ను ప్రారంభించారు. జాతీయ-అంతర్జాతీయ ప్రాముఖ్యంగల వివిధ చట్టపరమైన అంశాలపై అర్థవంతమైన సంప్రదింపులు-చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడటం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అలాగే ఆలోచనలు-అనుభవాల ఆదానప్రదానాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారంతోపాటు చట్టపరమైన సమస్యలపై అవగాహనను బలోపేతం చేయడం దీని ప్రధానోద్దేశాలు.