అహ్మదాబాద్ లో పుష్పాల అంతర్జాతీయ ప్రదర్శన దృశ్యాల్ని పంచుకొన్న ప్రధానమంత్రి
January 04th, 04:06 pm
అహ్మదాబాద్ లో పూల అంతర్జాతీయ ప్రదర్శన దృశ్యాల్ని కొన్నిటిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు. ‘ఈ ప్రదర్శనతో నాకు బలమైన అనుబంధం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రిగా నేను సేవ చేసిన కాలంలోనే ఈ ప్రదర్శన వృద్ధి చెందింది. ఈ తరహా ప్రదర్శనలు ప్రకృతి శోభను ఒక ఉత్సవంలా చాటిచెప్పడంతోపాటు చైతన్యానికీ, నిలకడతనం కలిగిన మనుగడకూ ప్రేరణగా నిలుస్తాయ’ని కూడా శ్రీ మోదీ అన్నారు.