We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services: PM Modi

December 09th, 11:09 am

PM Modi addressed the second edition of Infinity Forum, a global thought leadership platform on FinTech via video conferencing. PM Modi reiterated that India’s growth story is based on the government’s top priority to policy, good governance and the welfare of the citizens. Speaking about expanding the scope of IFSCA, PM Modi reiterated the government’s efforts to take GIFT IFSCA beyond traditional finance and ventures. “We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services”.

ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0లో ప్రధానమంత్రి ప్రసంగం

December 09th, 10:40 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ మేధా నాయకత్వ వేదికైన ఇన్ఫినిటీ ఫోరమ్ రెండో సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), ‘గిఫ్ట్’ సిటీ సంయుక్తంగా నిర్వహించాయి. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’ ఇతివృత్తంగా ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0 సమావేశం ఏర్పాటు చేయబడింది.

ఇన్ ఫినిటీ- ఫోరమ్, 2021 ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

December 03rd, 11:23 am

సాంకేతిక జగతి కి చెందిన, ఆర్థిక జగతి కి చెందిన నా దేశవాసులు, 70 కి పైగా దేశాల నుంచి పాలుపంచుకొంటున్న వేల కొద్దీ వ్యక్తులారా,

ఆర్థిక సాంకేతికతపై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రారంభించిన ప్రధానమంత్రి

December 03rd, 10:00 am

ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్‌)పై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- చరిత్ర అద్భుత పరిణామాన్ని ద్రవ్యం (కరెన్సీ) మన కళ్లకు కడుతుందని ప్రధాని అన్నారు. నిరుడు భారత్‌లో మొబైల్ చెల్లింపులు తొలిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భౌతికంగా ఎలాంటి శాఖా కార్యాలయాలు లేకుండానే డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయని, మరో దశాబ్దంలోగానే ఇవి సర్వసాధారణం కాగలవని పేర్కొన్నారు. “మన లావాదేవీల రూపం కూడా మానవ పరిణామ క్రమం తరహాలోనే మారుతూ వచ్చింది. ఆ మేరకు వస్తు మార్పిడి విధానం నుంచి లోహాలదాకా… నాణేల నుంచి నోట్ల వరకూ.. చెక్కుల నుంచి కార్డులదాకా నేడు ప్రస్తుత దశకు చేరుకున్నాం” అని ఆయన వివరించారు.

ఇన్ ఫినిటీ- ఫోరమ్ ను డిసెంబర్ 3వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

November 30th, 11:26 am

‘ఇన్ ఫినిటీ- ఫోరమ్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 3న ఉదయం 10 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇన్ ఫినిటీ ఫోరమ్ అనేది ‘ఫిన్- టెక్’ అంశం పై మేధోమథనం జరిపేటటువంటి ఒక నాయకత్వ వేదిక గా ఉంది.