The entire country is overjoyed because of the outstanding performance of our athletes in the Asian Games: PM Modi

October 10th, 06:25 pm

The Prime Minister, Shri Narendra Modi addressed the contingent of Indian athletes who participated in the Asian Games 2022 at Major Dhyan Chand Stadium in New Delhi today. He also interacted with the athletes. India won 107 medals including 28 gold medals in the Asian Games 2022 making this the best performance in terms of the total number of medals won in the continental multi-sport event.

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

October 10th, 06:24 pm

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొని దేశానికి విజయులై తిరిగి వచ్చిన భారత అథ్లెట్లనుద్దేశించి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వారితో ప్రధానమంత్రి సంభాషించారు. ఆసియా క్రీడోత్సవాలు 2022లో భారతదేశం 107 పతకాలు గెలుచుకుంది. వాటిలో 28 స్వర్ణ పతకాలున్నాయి. ఖండాంతర క్రీడా కార్యక్రమంలో భారతదేశం సాధించిన అత్యధిక పథకాలు ఇవే.

India made G20 a people-driven national movement: PM Modi

September 26th, 04:12 pm

PM Modi addressed the G20 University Connect Finale programme at Bharat Mandapam in New Delhi. Addressing the event, PM Modi credited the happenings in India to the youthful energy of the nation and said, Events of such scale are bound to be a success when the youth associate themselves with it.” It is evident from the activities of the last 30 days that India is becoming a happening place, the Prime Minister added.

జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం భారత్‌లో జి-20 సదస్సు సంబంధిత నాలుగు ప్రచురణల ఆవిష్కరణ;

September 26th, 04:11 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని భారత మండపంలో ‘జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. దేశంలోని యువతరంలో భారత జి-20 అధ్యక్షతపై అవగాహన పెంపు, సంబంధిత కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం లక్ష్యంగా విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం చేపట్టబడింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని జి-20 సంబంధిత 4 ప్రచురణలు- “జి20 అధ్యక్షతలో భారత్‌ ఘన విజయం-దార్శనిక నాయకత్వం-సార్వజనీన విధానం; జి-20కి భారత అధ్యక్షత- వసుధైవ కుటుంబకం; జి-20 విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమ సంగ్రహం; జి-20లో భారతీయ సంస్కృతీ ప్రదర్శన”ను ఆవిష్కరించారు.

కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు ఉత్సవం, వారణాసిలో అటల్ ఆవాసీయ విద్యాలయాల అంకిత మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం.

September 23rd, 08:22 pm

ఉత్తరప్రదేశ్‌ పాపులర్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ జి, వేదికమీద ఆశీనులైన అతిథులకు, కాశీ సంసద్‌ సాంస్కృతిక్‌ మహోత్సవ్‌లో పాల్గొంటున్న వారికి, ప్రస్తుతం రుద్రాక్ష్‌ సెంటర్‌ లో ఈ కార్యక్రమానికి హాజరైన కాశీనివాసితులకు స్వాగతం....

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి

September 23rd, 04:33 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.1115 కోట్ల‌తో నిర్మించిన 16 అట‌ల్ అవ‌సియా విద్యాల‌యాలను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. కాశీ సంసద్ ఖేల్ ప్రతియోగిత నమోదు కోసం పోర్టల్‌ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముందు అట‌ల్ అవ‌సియా విద్యాల‌యాల విద్యార్థుల‌తో కూడా ప్ర‌ధాన మంత్రి సంభాషించారు.

Varanasi's International Cricket Stadium will become a symbol of India in future: PM Modi

September 23rd, 02:11 pm

The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone of International Cricket Stadium in Varanasi today. The modern international cricket stadium will be developed in Ganjari, Rajatalab, Varanasi at a cost of about Rs 450 crores and spread across an area of more than 30 acres.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన

September 23rd, 02:10 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని గంజారి పరిధిలోగల రాజాతాలాబ్‌ ప్రాంతంలో రూ.450 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ- వార‌ణాసిని మ‌రోసారి సంద‌ర్శించే అవ‌కాశం లభించినందుకు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నగర సందర్శనలోని ఆనందానుభూతి మాట‌ల్లో చెప్ప‌లేనిద‌ని వ్యాఖ్యానించారు. గత నెల 23న చంద్రునిపై ‘శివశక్తి’ ప్రదేశానికి చంద్రయాన్‌ ద్వారా భారత్‌ చేరుకున్న సరిగ్గా నెల తర్వాత ఈ నెలలే అదే తేదీన కాశీని సందర్శిస్తున్నానని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “శివశక్తి ప్రదేశం ఒకటి చంద్రునిపై ఉంటే.. మరొకటి ఇక్కడ కాశీ నగరంలో ఉంది” అని చంద్రయాన్ మహత్తర విన్యాసంపై ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ప్రధాని వ్యాఖ్యానించారు.

వారాణసీ ని సెప్టెంబర్ 23 వ తేదీ న సందర్శించనున్న ప్రధాన మంత్రి

September 21st, 10:16 am

వారాణసీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 23 వ తేదీ నాడు సందర్శించనున్నారు. వారాణసీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియమ్ కు ప్రధాన మంత్రి మధ్యాహ్నం పూట సుమారు ఒంటిగంటన్నర వేళ కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం దాదాపు గా 3 గంటల 15 నిమిషాల కు, ప్రధాన మంత్రి రుద్రాక్ష్ ఇంటర్ నేశనల్ కోఆపరేశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటరు కు చేరుకొని కాశీ సంసద్ సాంస్కృతిక్ మహోత్సవ్ 2023 యొక్క ముగింపు కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. ఇదే కార్యక్రమం లో, ఆయన ఉత్తర్ ప్రదేశ్ లో లో నిర్మాణం పూర్తయిన 16 అటల్ ఆవాసీయ విద్యాలయాల ను కూడా ప్రారంభించనున్నారు.