Today is an occasion to recollect and reminisce the Parliamentary journey of 75 years of India: PM Modi

September 18th, 11:52 am

PM Modi addressed the Special Session of Parliament in Lok Sabha. In the journey of 75 years, Shri Modi said, this house has created the best of the conventions and traditions which has seen the contribution of all and witnessed by all. “We might be shifting to the new building but this building will keep on inspiring the coming generation. As it is a golden chapter of the journey of Indian democracy”, he said.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: లోక్‌సభలో ప్రధాని ప్రసంగం

September 18th, 11:10 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రసంగించారు. ఈ ప్రత్యేక సమావేశాలు 2023 సెప్టెంబరు 22వ తేదీవరకూ కొనసాగుతాయి. సభా వ్యవహారాలు త్వరలో కొత్త సౌధంలోకి మారనున్న నేపథ్యంలో భారత 75 ఏళ్ల పార్లమెంటరీ పయనంపై సంస్మరణకు, సింహావలోకనానికి ఈ రోజు ఒక సందర్భంగా కలసివచ్చిందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు పాత భవనం గురించి ప్రస్తావిస్తూ- మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా వ్యవహరించబడేదని ప్రధాని గుర్తుచేశారు.

పార్లమెంటుప్రత్యేక సమావేశాలు మొదలవడాని కన్న ముందు ప్రధాన మంత్రి చేసిన ప్రకటన యొక్క పాఠం

September 18th, 10:15 am

చంద్ర గ్రహం చెంత కు చేరుకోవడం కోసం సంకల్పించిన చంద్రయాన్-3 యొక్క సాఫల్యం మన మువ్వన్నెల జెండా ను సమున్నతం గా రెప రెపలాడిస్తున్నది. శివశక్తి పాయింట్ సరిక్రొత్త ప్రేరణ కు కేంద్రం గా మారింది. మరి అలాగే తిరంగా పాయింట్ మనకు గర్వకారణమైంది. ఆ తరహా కార్యసిద్ధులు సాకారం అయినప్పుడు వాటిని ఆధునికత్వం, విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానం లతో జతకలిపి చూడడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ విధమైన సత్తా ప్రపంచం ఎదుట కు వస్తుందో అప్పుడు భారతదేశానికి అనేక సంభావ్యత లు, అనేక అవకాశాలు మన ముంగిట కు వచ్చి వాలతాయి. జి-20 కి లభించినటువంటి అపూర్వమైన సాఫల్యం, 60 కి పైగా సభా స్థలాల లో ప్రపంచవ్యాప్త నేతల కు స్వాగతం పలకడం, మేథోమథన సమావేశాలు జరగడం, సమాఖ్య స్వరూపం వాస్తవిక స్ఫూర్తి తో కళ్ళ కు కట్టడం.. వీటి ద్వారా జి-20 లో మన వైవిధ్యాన్ని మరియు మన అద్వితీయత్వాన్ని ఒక ఉత్సవం మాదిరి జరుపుకోవడమైంది. జి-20 లో గ్లోబల్ సౌథ్ దేశాల కు వాణి గా మారినందుకు భారతదేశం సదా గర్వించగలుగుతుంది. ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం మరియు జి-20 లో ఏకగ్రీవం గా డిక్లరేశను ను ఆమోదించడం.. ఈ విషయాలు అన్నీ భారతదేశాని కి ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు ఉంది అనే సంకేతాన్ని ఇస్తున్నాయి.

యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 17th, 06:08 pm

నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృద‌యపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.

న్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి

September 17th, 12:15 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

‘యశోభూమి’ గా పిలిచే ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్యొక్క ఒకటో దశ ను సెప్టెంబర్ 17 వ తేదీ న న్యూ ఢిల్లీ లోని ద్వారక లో దేశ ప్రజల కుఅంకితం చేయనున్న ప్రధాన మంత్రి

September 15th, 04:37 pm

‘యశోభూమి’ గా పిలిచేటటువంటి ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసిసి) యొక్క ఒకటో దశ ను న్యూ ఢిల్లీ లోని ద్వారక లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ న ఉదయం 11 గంటల కు దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ద్వారక సెక్టర్ 21 నుండి క్రొత్త మెట్రో స్టేశన్ అయిన ‘యశోభూమి ద్వారక సెక్టర్ 25’ వరకు విస్తరణ పనులు పూర్తి అయిన దిల్లీ ఎయర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు.