అంతర్జాతీయ భారతి ఉత్సవం – 2020 లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం – తెలుగు అనువాదం

December 11th, 04:40 pm

ఆయన రచనలు, కవితలు, తాత్వికత, జీవితం మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించడానికి నాకు గౌరవం కలుగజేసిన వారణాసితో, ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయన సేకరించిన రచనలు 16 సంపుటాలలో ప్రచురించబడిందని నేను ఇటీవల చూశాను. 39 సంవత్సరాల స్వల్ప జీవితంలో ఆయన అతను చాలా రాశారు, చాలా చేశారు, చాలా రాణించారు. ఆయన రచనలు అద్భుతమైన భవిష్యత్తు వైపు మనకు మార్గనిర్దేశం చేస్తాయి.

‘అంతర్జాతీయ భారతి ఉత్సవం 2020’ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

December 11th, 04:22 pm

భారతియార్ జయంతి నాడు ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శ్రద్ధాంజలి ఘటించి, ‘అంతర్జాతీయ భారతి ఉత్సవం 2020’ ని ఉద్దేశించి ప్రసంగించారు. మహా కవి సుబ్రమణ్య భారతి 138వ జయంతి ని వేడుక గా జరపడానికి గాను ఈ ఉత్సవాన్ని వానవిల్ సాంస్కృతిక కేంద్రం నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం లో భారతి పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గాను పండితుడు శ్రీ సీనీ విశ్వనాథన్ కు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. శ్రీ సీనీ విశ్వనాథన్ కు పురస్కారాన్ని ఈ కార్యక్రమం లో ప్రదానం చేయడం జరిగింది.