హజీరా వద్ద రో-పాక్స్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
November 08th, 10:51 am
ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం ద్వారా ఆ ప్రాంతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారానుకూల వాతావరణం), ఈజ్ ఆఫ్ లివింగ్ (ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం)లో ఎలాంటి సానుకూల మార్పు వస్తుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు ఓ చక్కటి ఉదాహరణ. ఇప్పుడే నాకు నలుగురైదుగురు సోదరులు, సోదరీమణులతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. తీర్థయాత్రల విషయంలో, వారి వాహనాలకు తక్కువ నష్టం జరగడం, తక్కువ సమయంలో ప్రయాణం పూర్తవడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, వ్యవసాయంలో నష్టాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన పళ్లు, కూరగాయల ఉత్పత్తి.. సూరత్ మార్కెట్‌కు తరలించడం వంటి సౌకర్యాలను వారు నాతో పంచుకున్నారు. దీని వల్ల వ్యాపార సౌలభ్యం పెరగడంతోపాటు పనుల్లో వేగం పెరుగుతుంది. మొత్తంమీద సంతోషకర వాతావరణం ఏర్పుడుతుందని నేను విశ్వసిస్తున్నాను. వ్యాపారులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుసంధానతతో లబ్ధి పొందబోతున్నారు. మనవారి మధ్య దూరం తగ్గుతున్నకొద్దీ మనస్సు సంతృప్తి లభిస్తుంది.హజారియా ఆర్.ఒ. -పాక్స్ టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి.
November 08th, 10:50 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హజారియాలో ఆర్ఒ-పాక్స్ టెర్మినల్‌ను, హజారియా,- గుజరాత్‌లోని ఘోఘా మధ్య ఆర్ ఒ -పాక్స్ ఫెర్రి సర్వీసును జెండా ఊపి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఈ సేవలను ఉపయోగించుకునే వారితో మాట్లాడారు. షిప్పింగ్ మంత్రిత్వశాఖను మినిస్ట్రీ ఆఫ్ పొర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌గా మార్పు చేశారు.హజీరా లో రో-పాక్స్ టర్మినల్ ను ఈ నెల 8న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; హజీరా, ఘోఘా ల మధ్య రో-పాక్స్ ఫెరీ సేవకు ఆయన పచ్చజెండాను చూపి ప్రారంభిస్తారు
November 06th, 03:41 pm
హజీరా లో ప్రారంభిస్తున్న రో-పాక్స్ టర్మినల్ 100 మీటర్ల పొడవుతో, 40 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. పరిపాలన కార్యలయ భవనం, వాహనాలను నిలిపి ఉంచేందుకు స్థలం, సబ్ స్టేశన్, వాటర్ టవర్ మొదలైన విస్తృత శ్రేణి సౌకర్యాలు ఈ టర్మినల్ లో ఉంటాయి.వడోదరలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 22nd, 05:07 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారంనాడు వడోదరలొ జరిగిన ఒక బహిరంగ సభలో వడోదర సిటీ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను,వాఘోడియా ప్రాంతీయ నీటి సరఫరా పథకాన్ని, బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన కేంద్ర కార్యాలయభవనాన్ని జాతికి అంకితం చేశారు.గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో ఫెరి సర్వీసు ఒకటో దశను ఆయన ప్రారంభిస్తారు
October 21st, 06:17 pm
ఘోఘా లో ఓ బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని, ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో (రోల్ ఆన్, రోల్ ఆఫ్) ఫెరి సర్వీస్ యొక్క ఒకటో దశను ప్రారంభిస్తారు.