వికసిత భారత్ ప్రయాణంలో వార్తాపత్రికల పాత్ర కీలకం: ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
July 13th, 09:33 pm
ముంబైలోని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ సెక్రటేరియట్‌లో ఐఎన్‌ఎస్ టవర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజాస్వామ్యం మరియు సామాజిక మార్పులో మీడియా యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు, పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మరియు డిజిటల్ ఎడిషన్‌లను ప్రభావితం చేయాలని వార్తాపత్రికలను కోరారు. భారతదేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ మరియు పురోగతిని పెంపొందించడానికి సమిష్టి కృషికి పిలుపునిస్తూ, జాతీయ ఉద్యమాలు మరియు డిజిటల్ కార్యక్రమాలపై మీడియా ప్రభావాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు.ముంబాయిలో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ( ఐఎన్ ఎస్ ) టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని
July 13th, 07:30 pm
ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జి బ్లాక్ లోని భారతీయ వార్తాపత్రికల సంఘం కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఐఎన్ ఎస్ టవర్స్‌ను ప్రారంభించారు. నూతన భవనం ముంబాయిలో తగినంత స్థలంలో ఆధునిక కార్యాలయాన్ని కలిగివుందని ఇది ఐఎన్ ఎస్ సభ్యుల అవసరాలను తీరుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ముంబాయిలోని వార్తాపత్రికల పరిశ్రమకు ఇది కీలకమైన కేంద్రంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 13న ముంబైలో ప్రధానమంత్రి పర్యటన
July 12th, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 13వ తేదీన ముంబై నగరంలో పర్యటిస్తారు. ఆ రోజున సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ముంబైలోని గోరెగాఁవ్‌లో నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడ రహదారులు, రైల్వేలు, ఓడరేవుల రంగాలకు సంబంధించి రూ.29,400 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రాత్రి 7:00 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల జి-బ్లాక్‌లో ఇండియన్ న్యూస్ సర్వీస్ (ఐఎన్ఎస్) సెక్రటేరియట్‌కు వెళ్లి, ‘ఐఎన్ఎస్’ టవర్లను ప్రారంభిస్తారు.