ఇన్ ఫినిటీ- ఫోరమ్, 2021 ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
December 03rd, 11:23 am
సాంకేతిక జగతి కి చెందిన, ఆర్థిక జగతి కి చెందిన నా దేశవాసులు, 70 కి పైగా దేశాల నుంచి పాలుపంచుకొంటున్న వేల కొద్దీ వ్యక్తులారా,ఆర్థిక సాంకేతికతపై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రారంభించిన ప్రధానమంత్రి
December 03rd, 10:00 am
ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్)పై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- చరిత్ర అద్భుత పరిణామాన్ని ద్రవ్యం (కరెన్సీ) మన కళ్లకు కడుతుందని ప్రధాని అన్నారు. నిరుడు భారత్‌లో మొబైల్ చెల్లింపులు తొలిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భౌతికంగా ఎలాంటి శాఖా కార్యాలయాలు లేకుండానే డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయని, మరో దశాబ్దంలోగానే ఇవి సర్వసాధారణం కాగలవని పేర్కొన్నారు. “మన లావాదేవీల రూపం కూడా మానవ పరిణామ క్రమం తరహాలోనే మారుతూ వచ్చింది. ఆ మేరకు వస్తు మార్పిడి విధానం నుంచి లోహాలదాకా… నాణేల నుంచి నోట్ల వరకూ.. చెక్కుల నుంచి కార్డులదాకా నేడు ప్రస్తుత దశకు చేరుకున్నాం” అని ఆయన వివరించారు.ఇన్ ఫినిటీ- ఫోరమ్ ను డిసెంబర్ 3వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
November 30th, 11:26 am
‘ఇన్ ఫినిటీ- ఫోరమ్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 3న ఉదయం 10 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇన్ ఫినిటీ ఫోరమ్ అనేది ‘ఫిన్- టెక్’ అంశం పై మేధోమథనం జరిపేటటువంటి ఒక నాయకత్వ వేదిక గా ఉంది.