Second India-Australia Annual Summit

November 20th, 08:38 pm

PM Modi and Australian PM Anthony Albanese held the 2nd India-Australia Annual Summit in Rio de Janeiro. They reaffirmed their commitment to the Comprehensive Strategic Partnership, focusing on defense, trade, education, renewable energy, and people-to-people ties.

ఆంగ్ల అనువాదం: లావో‌స్‌లోని వియాంటియాన్‌లో జరుగుతోన్న 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

October 11th, 08:15 am

ఆసియాన్ ఐక్యత కోసం, ప్రాంతీయంగా అది ప్రధాన శక్తిగా ఎదిగేందుకు భారత్ నిరంతరం మద్దతిస్తోంది. భారత్ ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారానికి ఆసియాన్ కీలకం. భారత్ తీసుకున్న ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతంలో శాంతి నెలకొనడంతోపాటు అభివృద్ధి జరగడానికి స్వేచ్ఛ, అరమరికలులేని, సమ్మిళిత, అభ్యున్నతి దిశగా- పద్ధతితో కూడిన ఇండో-పసిఫిక్ కార్యక్రమాలు ఉండాలి.

19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి

October 11th, 08:10 am

ఇండో-పసిఫిక్ ప్రాంతీయ రాజకీయ నిర్మాణంలోనూ, భారతదేశపు ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారంలో- ఆసియాన్ పాత్ర చాలా కీలకమని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వివరించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో భారతదేశం పాల్గొనడం తన తూర్పు దేశాల ప్రాధాన్యత (యాక్ట్ ఈస్ట్)లో ముఖ్యమైన విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతికీ, అభివృద్ధికీ- స్వేచ్చ, సమ్మిళిత, సుసంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ముఖ్యమని చెబుతూ భారతదేశ ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య సారూప్యత, సాధారణ విధానం గురించీ మాట్లాడారు. ఈ ప్రాంతం విస్తరణ వాదంపై దృష్టి సారించడం కంటే అభివృద్ధి ఆధారిత విధానాన్ని అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

September 19th, 03:07 pm

ప్రధాని మోదీ 21-23 సెప్టెంబర్ 2024 సమయంలో యూఎస్ సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని ప్రసంగిస్తారు.

బ్రూనై సుల్తానుతో సమావేశం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం ఆంగ్ల పాఠానికి అనువాదం

September 04th, 03:18 pm

సాదర వచనాలతో స్వాగతించి, ఘనంగా ఆతిథ్యమిచ్చిన మీకు, రాజ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

భారత్-గ్రీస్ సంయుక్త ప్రకటన

August 25th, 11:11 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న గ్రీస్‌ దేశంలో అధికారికంగా పర్యటించారు. హెలెనిక్ గణతంత్రమైన గ్రీస్ ప్రధాని గౌరవనీయ కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సందర్శించారు.

గ్రీస్ లో పత్రికా విలేకరుల ఉమ్మడి సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన ఆంగ్ల అనువాదం

August 25th, 02:45 pm

గ్రీస్ లో అటవీ అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా తరఫున, భారత ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులైన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

భారత-ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ రోడ్ మ్యాప్

July 14th, 11:10 pm

భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మకంగా నిలిచిన శక్తులు కావడంతో పాటు భారత పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామ్యం గల దేశాలు. హిందూ మహాసముద్రంలో భారత-ఫ్రెంచి భాగస్వామ్యం ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన అంశం. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక సహకార విజన్’’పై 2018 సంవత్సరంలో ఉభయ దేశాలు ఒక అంగీకారం కుదుర్చుకున్నాయి. మనం ఇప్పుడు దాన్ని పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయత్నాలకు విస్తరించాయి.