బహుమతి సొమ్మును భారతీయ సైన్య సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చిన కువైత్ ప్రవాసీ భారతీయ విద్యార్థి రిద్ధిరాజ్
August 03rd, 04:43 pm
కువైత్ లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ విద్యార్థి చిరంజీవి రిద్ధిరాజ్ కుమార్ 18,000 రూపాయల విలువైన ఒక చెక్కును సైన్య సంక్షేమ నిధికి గాను విరాళంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేశారు. రిద్ధిరాజ్ కుమార్ మొత్తం 80 కువైత్ దినార్ లను ఎసిఇఆర్ నుండి బహుమతి సొమ్ముగా గెలుచుకున్నాడు.