నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
November 06th, 10:50 pm
అమెరికా అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. శ్రీ ట్రంప్ సాధించిన అద్భుత విజయానికి శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. భారత్ - అమెరికా సంబంధాలు వివిధ రంగాల్లో మరింతగా బలపడేటట్లు శ్రీ ట్రంప్ తో మళ్లీ కలిసి పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.డెలావర్ లోని విల్మింటన్ లో అమెరికా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
September 22nd, 02:02 am
భారత్ అమెరికాల భాగస్వామ్యానికి ముందుకు తీసుకుపోవడంలో అధ్యక్షుడు శ్రీ బైడెన్ అసమానమైన సేవలను అందించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందలు తెలిపారు. అమెరికాలో 2023 జూన్ లో తాను పర్యటించడాన్ని, అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో భారతదేశంలో జరిగిన జి-20 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారత్ కు రావడాన్ని శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తు చేశారు. ఈ పర్యటనలు భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని ఉపయోగకరంగా మార్చాయనీ, తగిన వేగాన్నీ అందించాయనీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.