భారత-యూకే వాస్తవిక సాదృశ సమావేశం

May 04th, 06:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇవాళ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. భారత-యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య చిరకాల స్నేహసంబంధాలున్నాయి. దీంతోపాటు ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన తదితరాల సమన్వయంతో కూడిన వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఈ బంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ‘మార్గప్రణాళిక-2030’ని ఆమోదించారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, రక్షణ-భద్రత, వాతావరణ మార్పు కార్యాచరణ, ఆరోగ్యం తదితర ముఖ్యమైన రంగాల్లో రాబోయే పదేళ్లలో మరింత లోతైన, బలమైన సంబంధాల దిశగా ఈ మార్గ ప్రణాళిక దోహదం చేస్తుంది.

ఇండియా-యుకె వర్చువల్ సమిట్ (మే 04, 2021)

May 02nd, 09:19 pm

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరేబల్ శ్రీ బోరిస్ జాన్ సన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మే నెల 4వ తేదీ న వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు.