భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక

August 22nd, 08:22 pm

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:

‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన

August 22nd, 08:21 pm

పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.

పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం

August 22nd, 03:00 pm

అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.