ఫిబ్రవరి 6న ప్రధానమంత్రి కర్ణాటక పర్యటన

February 04th, 12:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 6న కర్ణాటకలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ రోజున ఉదయం 11:30 గంటలకు బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు తుమకూరులో ‘హెచ్‌ఎఎల్’ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు.

భార‌త‌దేశ ఇంధ‌న వేదిక‌ ప్రారంబోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

October 26th, 05:22 pm

ఈ ఏడాది ఏర్పాటు చేసుకున్న ప్ర‌త్యేక అంశం ఎంతో స‌ముచిత‌మైన‌ది. మారుతున్న ప్ర‌పంచంలో భార‌త‌దేశ ఇంధ‌న భ‌విష్య‌త్తు అనేది ఈ ఏడాది ప్ర‌త్యేక అంశం. మీ అంద‌ర‌కీ భ‌రోసా ఇస్తున్నాను. భార‌త‌దేశంలో కావల‌సినంత ఇంధ‌నం వుంది. భార‌త‌దేశ ఇంధ‌న భ‌విష్య‌త్ ఉజ్వ‌లంగాను, భ‌ద్రంగాను వుంది. అది ఎలాగో వివ‌రిస్తాను.

4 వ ఇండియా ఎనర్జీ ఫోరంలో ప్రారంభోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి

October 26th, 05:19 pm

4వ ఇండియా ఎనర్జీ ఫోరం సెరా వీక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు. మార్పు చెందుతున్న ప్రపంచంలో భారతదేశ ఇంధన భవిష్యత్తు అనేది ఈ సారి ఇతివృత్తంగా నిర్ణయించారు.