భారతదేశం యొక్క రాబోయే వెయ్యి సంవత్సరాలకు మేము బలమైన పునాది వేస్తున్నాము: ఆస్ట్రియాలో ప్రధాని మోదీ

July 10th, 11:00 pm

వియన్నాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గత 10 సంవత్సరాలలో దేశం సాధించిన పరివర్తనాత్మక పురోగతి గురించి ఆయన ప్రసంగించారు మరియు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా - విక్షిత్ భారత్‌గా మారే మార్గంలో భారతదేశం సమీప భవిష్యత్తులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆస్ట్రియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 10th, 10:45 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియన్నా లో ప్రవాసీ భారతీయులు ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొని, భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమ స్థలానికి ప్రధాన మంత్రి రాగానే, భారతీయ సముదాయం ఆయనకు ఎంతో ఉత్సాహం తోను, ఆప్యాయంగాను స్వాగతం పలికింది. ఆస్ట్రియా కార్మిక, ఆర్థిక వ్యవస్థ శాఖ మంత్రి శ్రీ మార్టిన్ కొచెర్ కూడా ఈ సాముదాయిక సభ లో పాలుపంచుకొన్నారు. ఆస్ట్రియా నలుమూలలా విస్తరించివున్న ప్రవాసీ భారతీయులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.

భారత-ఆస్ట్రియా సీఈవోల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

July 10th, 07:01 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ గౌరవనీయ కార్ల్ నెహమ్మర్ ఇవాళ భారత-ఆస్ట్రియా దేశాల్లోని భిన్న రంగాల అగ్రగామి సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారు(సీఈవో)ల సమావేశంలో సంయుక్తంగా ప్రసంగించారు. ఉభయ దేశాల్లోని ఆటోమొబైల్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, ఇంజినీరింగ్ రంగాలు సహా పలు అంకుర సంస్థల సీఈవోలు ఇందులో పాల్గొన్నారు.