జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ‘బలవర్ధక బియ్యం’ ఉచిత పంపిణీ సహా ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు మంత్రివర్గ ఆమోదం
October 09th, 03:07 pm
జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ సహా అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) ఉచిత పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాలు ప్రస్తుతం అమలవుతున్న విధానాల్లోనే కొనసాగుతాయి.అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా దేశంలోని యువత ప్రయోజనం పొందారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 25th, 11:30 am
మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
August 16th, 05:42 pm
భారతదేశం 78వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రధాని శ్రీ నెతన్యాహు తన స్నేహపూర్ణ శుభాకాంక్షలను వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న స్థితిపై ఇద్దరు నేతలు చర్చించారు.డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు
August 15th, 09:20 pm
భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 03:04 pm
ప్రసంగంలోని ప్రధానాంశాలు:78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 01:09 pm
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన, దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన, దేశం కోసం జీవితాంతం పోరాడిన, ఉరికంబం పై కూడా జై భారతమాత అని నినదించిన అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొనే ఆ శుభ ఘడియ ఈ రోజు. వారి పవిత్ర స్మృతులను స్మరించుకొనే పండుగ ఈ రోజు. ఆ సమరయోధుల త్యాగం తో మనకు లభించిన ఈ స్వేచ్చా వాయువులు జీవితాంతం మనం వారికి రుణ పడేలా చేసింది. అలాంటి ప్రతి మహానుభావుడికి మన గౌరవాన్ని తెలియజేస్తున్నాం.ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 78వ స్వాతంత్ర్య దినోత్సవం నుండి సంగ్రహావలోకనం
August 15th, 10:39 am
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌ను వివరించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం నుండి లౌకిక సివిల్ కోడ్‌ను సాధించడం వరకు, భారతదేశం యొక్క సామూహిక పురోగతిని మరియు ప్రతి పౌరుని సాధికారతను ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. అవినీతిపై నూతనోత్సాహంతో పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. ఆవిష్కరణలు, విద్య మరియు ప్రపంచ నాయకత్వంపై దృష్టి సారించి, 2047 నాటికి భారతదేశం వికసిత భారత్‌గా మారకుండా ఏదీ ఆపలేవని పునరుద్ఘాటించారు.78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మక స్వప్నాన్ని నిర్దేశించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 10:16 am
భారతదేశ వృద్ధికి రూపం ఇవ్వడం, ఆవిష్కరణలకు దారి చూపడం, వివిధ రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలనే భవిష్యత్తు లక్ష్యాలను 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:30 am
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్‌ను వివరించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం నుండి లౌకిక సివిల్ కోడ్‌ను సాధించడం వరకు, భారతదేశం యొక్క సామూహిక పురోగతిని మరియు ప్రతి పౌరుని సాధికారతను ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. అవినీతిపై నూతనోత్సాహంతో పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. ఆవిష్కరణలు, విద్య మరియు ప్రపంచ నాయకత్వంపై దృష్టి సారించి, 2047 నాటికి భారతదేశం వికసిత భారత్‌గా మారకుండా ఏదీ ఆపలేవని పునరుద్ఘాటించారు.స్వాతంత్ర్య దినం సందర్భంగా అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
August 15th, 07:05 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రపతి గారి ప్రసంగం మనకు సంపన్న ప్రగతిశీల భారతదేశ నిర్మాణంలో ప్రేరణనిస్తుంది: ప్రధానమంత్రి
August 14th, 09:05 pm
భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన ప్రసంగం సంపన్న, ప్రగతిశీల భారతదేశ నిర్మాణంలో మనం మరింత పాటుపడేలా ప్రేరణనిచ్చేదిగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.పౌరులు వారి సామాజిక ప్రసార మాధ్యమాల ప్రొఫైల్ పిక్చర్ ను మువ్వన్నెల పతాకంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి విజ్ఞప్తి
August 09th, 09:01 am
సామాజిక మాధ్యమ వేదికలలో పౌరులు వారి ప్రొఫైల్ పిక్చరును త్రివర్ణ పతాక చిత్రంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినాన్ని పండుగలాగా జరుపుకోవడానికని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రొఫైల్ పిక్చరు ను మువ్వన్నెల జెండా చిత్రంతో మార్చుకొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని ఒక గుర్తుపెట్టుకోదగ్గ ప్రజాఉద్యమంగా మలచడానికి ఇదే పనిని చేయాలంటూ ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞప్తి చేశారు.శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
August 02nd, 02:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు దేశం కోసం మువ్వన్నెల పతాకాన్ని అందించడంలో శ్రీ పింగళి వెంకయ్య చేసిన కృషిని స్వరించుకొన్నారు. ఈ నెల 9-15 తేదీల మధ్య కాలంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారాను, ప్రజలు వారి సెల్ఫీలను harghartiranga.com లో పంచుకోవడం ద్వారాను ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా మువ్వన్నెల జెండా) ప్రచార ఉద్యమాన్ని బలపరచవలసిందిగా కూడా శ్రీ నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు.ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం మీ సూచనలను అందించండి
August 01st, 05:55 pm
భారతదేశం ఆగస్ట్ 15, 2024న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధాని మోదీ ప్రసంగం కోసం మీ విలువైన ఆలోచనలు మరియు సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నిర్మాణానికి సహకరించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్.!!లోక్ మాన్య తిలక్ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
July 23rd, 09:57 am
లోక్ మాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. పుణె లో గత సంవత్సరం జరిగిన ఒక కార్యక్రమంలో లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని తాను స్వీకరించిన వేళ తాను ఇచ్చిన ఉపన్యాసాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పంచుకొన్నారు.The friendship between Bharat and the UAE is reaching unprecedented heights: PM Modi
February 13th, 11:19 pm
Prime Minister Narendra Modi addressed the 'Ahlan Modi' community programme in Abhi Dhabi. The PM expressed his heartfelt gratitude to UAE President HH Mohamed bin Zayed Al Nahyan for the warmth and affection during their meetings. The PM reiterated the importance of the bond that India and UAE share historically. The PM said, “India and UAE are partners in progress.”యుఎఇ లో జరిగిన భారతీయ సముదాయం సంబంధి కార్యక్రమం ‘‘అహ్‌లన్ మోదీ’’ లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 13th, 08:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని భారతీయ సముదాయం ఏర్పాటు చేసినటువంటి ‘‘అహ్‌లన్ మోదీ’’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొని, సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో 7 ఎమిరేట్స్ నుండి భారతీయ ప్రవాసుల తో పాటు అన్ని సముదాయాల కు చెందిన భారతీయులు పాల్గొన్నారు. సభ కు హాజరు అయిన వారిలో ఎమిరేట్స్ పౌరులు కూడా ఉన్నారు.తమిళనాడు.. లక్షద్వీప్ దీవులలో 2024 జనవరి 2-3 తేదీల్లో ప్రధానమంత్రి పర్యటన
December 31st, 12:56 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జనవరి 2, 3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ దీవులలో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 2వ తేదీన ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి చేరుకుంటారు. అక్కడ భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో నగరంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పౌర విమానయానం, రైలు, రోడ్డు, చమురు-గ్యాస్, ఉన్నత విద్యా రంగాలకు చెందిన రూ.19,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.జమ్మూలోని సరిహద్దు ప్రాంతానికి చెందిన సర్పంచ్ అంకితభావానికి ప్రధాన మంత్రి ప్రశంసలు
November 30th, 01:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో సంభాషించారు. ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం వేదికగా, ప్రధాన మంత్రి దేవఘర్ ఎయిమ్స్ లో అధిగమించిన మైలురాయి 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని అంకితం చేశారు. ఇంకా, దేశంలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్‌లను అందించడం, జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కి పెంచడం వంటి ఈ రెండు కార్యక్రమాలను ప్రధాని ప్రకటించారు. ఈ వాగ్దానాలను నేడు నెరవేరుస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.