భారత-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం
December 29th, 06:44 pm
భారత-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం (ఇండాస్ ఎక్టా) ఇవాళ్టినుంచి అమలులోకి రావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక మేలిమలుపని ఈ సందర్భంగా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (IndAus ECTA) తాలూకు వర్చువల్సైనింగ్ సెరిమని లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 02nd, 10:01 am
ఒక నెల కన్నా తక్కువ కాలం లోనే ఈ రోజు న నేను నా మిత్రుడు శ్రీ స్కాట్ తో పాటు గా మూడో సారి నేను ముఖాముఖి గా సమావేశం అవుతున్నాను. కిందటి వారం లో మన మధ్య జరిగిన వర్చువల్ సమిట్ లో చాలా ఫలప్రదం అయినటువంటి చర్చ చోటు చేసుకొంది. ఆ కాలం లో ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ విషయమై సంప్రదింపుల ను వీలైనంత త్వరలో ముగించవలసింది గా మన బృందాల కు మనం ఆదేశాల ను ఇచ్చాం. మరి ఈ రోజు న ఈ ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాల పై సంతకాలు జరుగుతూ ఉండటం తో నేను చాలా ప్రసన్నం గా ఉన్నాను. ఈ అసాధారణమైన కార్యసాధన కు గాను, నేను ఇరు దేశాల వ్యాపార మంత్రుల కు మరియు వారి వారి అధికారుల కు హృదయ పూర్వక అభినందనల ను తెలియజేస్తున్నాను.ప్రధాన మంత్రి సమక్షంలో ది ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’) పై సంతకాలు చేయడం జరిగింది
April 02nd, 10:00 am
వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమం లో భారతదేశం ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ ల సమక్షం లో భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమ, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, సార్వజనిక వితరణ మరియు వస్త్రాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో వ్యాపారం, పర్యటన, ఇంకా పెట్టుబడి శాఖ మంత్రి శ్రీ డాన్ తెహాన్ లు ఈ రోజు న ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’)పై సంతకాలు చేశారు.