లక్షద్వీప్ లోని అగతి విమానాశ్రయంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం
January 02nd, 04:45 pm
లక్షద్వీప్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయినప్పటికీ స్వాతంత్ర్యానంతరం గణనీయమైన కాలానికి, ఈ ప్రాంతం యొక్క మౌలిక సదుపాయాలు పరిమిత దృష్టిని పొందాయి. షిప్పింగ్ కీలకమైన జీవనాధారం అయినప్పటికీ, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదు. విద్య, వైద్యం మొదలుకొని పెట్రోల్, డీజిల్ లభ్యత వరకు వివిధ రంగాల్లో సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా ప్రభుత్వం ఇప్పుడు ఈ సమస్యలను చురుకుగా పరిష్కరిస్తోంది, ఇది గణనీయమైన మార్పును సూచిస్తుంది. లక్షద్వీప్లో మొట్టమొదటి పీఓఎల్ బల్క్ స్టోరేజ్ ఫెసిలిటీని కవరట్టి, మినికోయ్ దీవుల్లో ఏర్పాటు చేశారు. ఫలితంగా పలు రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి.లక్షద్వీప్‌లోని అగట్టి ఎయిర్‌పోర్టువద్ద బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగం
January 02nd, 04:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ లక్షద్వీప్‌లోని అగట్టి విమానాశ్రయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- లక్షద్వీప్‌లోగల అపార అవకాశాల గురించి ఆయన నొక్కిచెప్పారు. అయితే, స్వాతంత్ర్యం వచ్చాక ఈ దీవులు సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని విచారం వెలిబుచ్చారు. ఈ ప్రాంతానికి నౌకాయానం జీవనాడి అయినప్పటికీ, ఓడరేవు మౌలిక సదుపాయాలను తగినంతగా అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రస్తావించారు. అలాగే విద్య, ఆరోగ్య రంగాలతోపాటు పెట్రోలు, డీజిల్ విషయంలో ఉదాసీనతను ఈ ప్రాంతం ఎదుర్కొన్నదని ప్రధాని వివరించారు. ఈ పరిస్థితులను ప్రభుత్వం ఇప్పుడు చక్కదిద్దుతూ, ప్రగతికి బాటలు పరచిందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘లక్షద్వీప్ ప్రజల సమస్యలన్నిటినీ మా ప్రభుత్వం పూర్తిగా పరిష్కరిస్తోంది’’ అని గుర్తుచేశారు.