అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

August 03rd, 09:35 am

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..

వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 03rd, 09:30 am

అంత‌ర్జాతీయ వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ స‌మావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్య‌వ‌సాయ‌శాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) స‌ముదాయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ ఏడాది స‌మావేశ థీమ్ సుస్థిర వ్య‌వ‌సాయ‌, ఆహార వ్య‌వ‌స్థ‌ల దిశ‌గా ప‌రివ‌ర్త‌న‌. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాట‌డ‌మే ఈ సమావేశ‌ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ఆగస్టు 3న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

August 02nd, 12:17 pm

వ్యవసాయ ఆర్థికవేత్తల ముప్ఫై రెండో అంతర్జాతీయ సమావేశాన్ని (ఐసిఎఇ) శనివారం, అంటే 2024 ఆగస్టు 3న, న్యూ ఢిల్లీ లోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ (ఎన్ఎఎస్‌సి) కాంప్లెక్స్ లో ఉదయం సుమారు 9 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.