అంతర్జాతీయ సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 25th, 03:30 pm
మీ అందరికీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నానంటే, అది నేనొక్కడిని చేసింది కాదు.. నిజానికి నేనొక్కడినే చేయలేను కూడా. భారత్ లోని లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది పశుపోషకులు, దేశంలోని మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయంసహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలను సాంకేతికతతో అనుసంధానిస్తున్న భారత యువత తరఫున – మిమ్మల్ని నేను భారత్ కు ఆహ్వానిస్తున్నాను.2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సును ప్రారంభించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ మనోవా కమికామికా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబీ షార్ప్, అంతర్జాతీయ సహకార సమితి అధ్యక్షుడు శ్రీ ఏరియల్ గార్కో, విదేశీ ప్రముఖులు తదితరులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.ఐసీఏ అంతర్జాతీయ సహకార సదస్సు-2024ను ప్రారంభించనున్న ప్రధాని
November 24th, 05:54 pm
ఐసీఏ అంతర్జాతీయ సహకార సదస్సు, ఐసీఏ సాధారణ సమావేశాలను అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి భారత్ లో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ సహకార ఉద్యమంలో అది ప్రధాన సంస్థ. ఐసీఏ, కేంద్ర ప్రభుత్వం, భారతీయ సహకార సంస్థలైన అమూల్, క్రిభ్ కో సహకారంతో రైతులు, ఎరువుల సహకార సంస్థ (ఐఎఫ్ఎఫ్ సీవో) నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు నవంబరు 25 నుంచి 30 వరకు జరుగుతుంది.