హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

November 26th, 10:10 am

నేను పార్లమెంటుకు చేరుకోవాల్సి ఉన్నందున సమయం చాలా తక్కువగా ఉంది. గౌరవ రాష్ట్రపతితో ఒక కార్యక్రమం ఉంది. అందువల్ల ఎక్కువసేపు మాట్లాడకుండా నేను కొన్ని అంశాలను త్వరగా పంచుకుని... నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ రోజు నుంచి భారత విమానయాన రంగం కొత్త ఊపును పొందబోతోంది. ఈ కొత్త శాఫ్రాన్ కేంద్రం భారత్‌ను ప్రపంచ ఎంఆర్వో కేంద్రంగా నిలపడంలో సహాయపడుతుంది. ఈ ఎంఆర్వో కేంద్రం హైటెక్ ఏరోస్పేస్ ప్రపంచంలో యువతకు కొత్త అవకాశాలనూ సృష్టిస్తుంది. నేను ఈనెల 24న సాఫ్రాన్ బోర్డు యాజమాన్యాన్ని కలిశాను. నేను వారిని ఇంతకు ముందు కూడా కలిశాను. ప్రతి చర్చలోనూ భారత్ పట్ల వారి నమ్మకం, ఆశను నేను చూశాను. భారత్‌లో శాఫ్రాన్ పెట్టుబడి అదే వేగంతో కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ కేంద్రం కోసం కృషి చేసిన టీం శాఫ్రాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

హైదరాబాద్‌లోని ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి

November 26th, 10:00 am

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. శాఫ్రాన్‌ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ఎంఆర్ఓ కేంద్రం అత్యాధునిక సాంకేతిక గల విమానాయన రంగంలో యువతకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. నవంబర్ 24న శాఫ్రాన్ బోర్డు, అధికారుల బృందాన్ని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికంటే ముందు కూడా వారితో జరిగిన ప్రతి చర్చలో భారత్‌ పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో శాఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శాఫ్రాన్ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

నవంబర్ 26న ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

November 25th, 04:16 pm

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 26న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు.

'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

October 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అనువాదం: జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

September 21st, 06:09 pm

శక్తిని ఆరాధించే పండగ అయిన నవరాత్రి రేపు ప్రారంభమవుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రి మొదటి రోజే.. దేశం ఆత్మనిర్భర్ భారత్‌ వైపు మరో ముఖ్యమైన ముందడుగు వేస్తోంది. రేపు అంటే సెప్టెంబర్ 22న నవరాత్రి మొదటి రోజు నాడు సూర్యుడు ఉదయించే మాదిరిగానే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు కూడా అమలులోకి రానున్నాయి. ఒక విధంగా దేశంలో రేపటి నుంచి జీఎస్టీ పొదుపు అనే పండగ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ పండగ మీ పొదుపులను పెంచుతుంది.. మీరు కావలసిన వస్తువులను మరింత తక్కువ ధరకు కొనుక్కునేలా చూసుకుంటుంది. మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, నవ- మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పొదుపు అనే పండగ నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. అంటే ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరు తీపి కబురు ఉండటంతో పాటు దేశంలోని ప్రతి కుటుంబం ఆశీర్వాదం పొందుతుందన్న మాట. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాటు పొదుపనే ఈ పండగ విషయంలో దేశంలోని కోట్లాది కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి. వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.. పెట్టుబడులు పెట్టటాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.. అభివృద్ధికి సంబంధించిన పోటీలో ప్రతి రాష్ట్రాన్ని సమాన స్థానంలో నిలబెడుతుంది.

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 21st, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. శక్తిని పూజించే పండుగ నవరాత్రి ప్రారంభం సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రి మొదటి రోజు నుంచే దేశం ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో కీలక ముందడుగు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 22న సూర్యోదయం నుంచే దేశంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయన్నారు. ఇది భారత్ అంతటా జీఎస్టీ బచత్ ఉత్సవ ప్రారంభాన్ని సూచిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ పండుగ పొదుపును పెంచుతుందనీ.. ప్రజలు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తుందనీ ఆయన స్పష్టం చేశారు. ఈ పొదుపు పండుగ ప్రయోజనాలు పేదలు, మధ్యతరగతి, నవ మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సమానంగా చేరుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సీజన్‌లో ప్రతి కుటుంబం రెట్టింపు ఆనందాన్ని, మాధుర్యాన్ని పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ పొదుపు పండుగ కోసం దేశంలోని కోట్లాది కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంస్కరణలు దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయని.. వ్యాపార కార్యకలాపాలనూ సులభతరం చేస్తాయని.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రధానమంత్రి వివరించారు. అభివృద్ధి పోటీలో ప్రతి రాష్ట్రం సమాన భాగస్వామిగా మారుతుందనీ ఆయన ఆకాంక్షించారు.

‘స్థానికులకు స్వరం’ – మన్ కీ బాత్ లో, ప్రధాన మంత్రి మోదీ స్వదేశీ గర్వంతో పండుగలను జరుపుకోవాలని కోరారు

August 31st, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన వారికి సహాయం అందించిన భద్రతా దళాలు మరియు పౌరులకు ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో క్రీడా కార్యక్రమాలు, సౌరశక్తి, ‘ఆపరేషన్ పోలో’ మరియు భారతీయ సంస్కృతి యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని పౌరులకు గుర్తు చేశారు.

హైదరాబాద్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపట్ల ప్రధాని సంతాపం

May 18th, 12:00 pm

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణనష్టంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నవీకరణ, అయిదు జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పథకానికి క్యాబినెట్ ఆమోదం

May 07th, 02:07 pm

జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నవీకరణతోపాటు అయిదు (5) జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల (ఎన్‌సీవోఈ) ఏర్పాటు పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకంగా దీన్ని రూపొందించారు. భారత్‌లో వృత్తి విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు.

వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

January 06th, 01:00 pm

తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ గారు, నా మంత్రివర్గ సహచరులు - శ్రీ అశ్వనీ వైష్ణవ్ గారు, శ్రీ జి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ సోమయ్య గారు, శ్రీ రణవీత్ సింగ్ బిట్టూ గారు, శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, విశిష్ట అతిథులు, సోదర, సోదరీమణులారా!

వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

January 06th, 12:30 pm

వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించడమే కాక కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజనును ప్రధాని ప్రారంభించారు. ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, తెలంగాణలో చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషనును ప్రారంభించారు.

జనవరి 6న వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి

January 05th, 06:28 pm

జనవరి 6 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్లో జరిగే డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సదస్సుకు హాజరు కానున్న ప్రధాని

November 29th, 09:54 am

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఒడిశాలో జరిగే డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత కాన్ఫరెన్స్ 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. భువనేశ్వర్లో ఉన్న లోక్ సేవాభవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రి

October 28th, 12:47 pm

ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్య రంగానికి చెందిన సుమారు రూ.12,850 కోట్ల ప్రాజెక్టులకు అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

మాజీ ఉప-రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై జూన్ 30న మూడు పుస్తకాలను ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి

June 29th, 11:03 am

మాజీ ఉప-రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు 75వ జన్మదినోత్సవం నేపథ్యంలో ఆయన జీవన ప్రస్థానంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 30న మధ్యాహ్నం 12:00 గంటలకు మూడు పుస్తకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోగల అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad

May 10th, 04:00 pm

Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.

PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana

May 10th, 03:30 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.

YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry

May 06th, 03:45 pm

Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”

PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle

May 06th, 03:30 pm

Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”

తెలంగాణలోని సంగారెడ్డిలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 05th, 10:39 am

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు కొండా సురేఖ గారు, కె.వెంకటరెడ్డి గారు, పార్లమెంటులో నా సహచరులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్.