చేతివృత్తులవారి ఆకాంక్షలకు హునార్ హాత్ రెక్కలు ఇచ్చింది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 23rd, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా, మన దేశం లో ఎన్నో గొప్ప సంప్రదాయాలు ఉన్నాయి. మన పూర్వీకులు మనకు వారసత్వం గా ఇచ్చినవి, మనకు లభించిన విద్య, ఉపదేశాలూ అన్నీనూ. వీటిలో తోటి జీవుల పట్ల కనికరం, ప్రకృతి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఇవన్నీ మన సాంస్కృతిక వారసత్వాలు. ప్రతి ఏడాదీ భారతదేశం లోని ఈ వాతావరణం ఆతిథ్యాన్ని తీసుకోవటానికి, ప్రపంచం నలుమూలల నుండి వివిధ జాతుల భారతదేశం వస్తాయి. ఏడాది పొడుగునా ఎన్నో వలస జాతుల కు భారతదేశం ఇల్లు గా మారుతుంది. ఐదు వందల కన్నా ఎక్కువ పక్షులు, రకరకాల జాతుల పక్షులు, రకరకాల ప్రాంతాల నుండి వస్తాయని చెబుతూ ఉంటారు. ఇటీవల, గాంధీ నగర్ లో ‘సిఒపి – 13 కన్వెన్శన్’ జరిగింది. అందులో ఈ విషయంపై ఎన్నో ఆలోచనలు, ఎంతో చింతన, ఎంతో మేధోమథనం జరిగాయి. భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కు కూడా ఎంతో ప్రశంస లభించింది. మిత్రులారా, రాబోయే మూడేళ్ల పాటు వలస జాతులపై జరగనున్న ‘సిఒపి కన్వెన్శన్’ కు భారతదేశం అధ్యక్షత వహించటం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భాన్ని మనం ఎలా ఉపయోగకరం గా మార్చుకోవచ్చునో, మీరు మీ సలహాలను తప్పక తెలియచేయండి.

ప్రధాని మోదీ హునార్ హాత్ సందర్శన నుండి ప్రత్యేకమైన చిత్రాలు ... చూడండి!

February 19th, 06:20 pm

ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేయబడిన హునార్ హాత్ ను ఈ రోజు అప్రకటింతంగా ప్రధాని మోదీ సందర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేతివృత్తుల వారి వివిధ ఉత్పత్తులను ప్రదర్శించడానికి హునార్ హాత్ ఒక ప్రత్యేకమైన వేదిక, ఇందులో హస్తకళలు, వస్త్రాలు మరియు మరిన్ని ఉన్నాయి. హునార్ హాత్‌లో పాల్గొంటున్న దేశవ్యాప్తంగా ఉన్న మాస్టర్ ఆర్టిసన్స్, హస్తకళాకారులు మరియు పాక నిపుణుల స్టాల్స్‌ ను ప్రధాని మోదీ సందర్శించారు.

ఒక కళాకారుడు ప్రధాని మోదీకి భారతదేశ పటాన్ని హునార్ హాత్ వద్ద సమర్పించినప్పుడు ...

February 19th, 06:15 pm

హునార్ హాత్ భారతదేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారులు మరియు హస్తకళాకారులకు వారి వివిధ ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఒక వేదికను ఇచ్చారు. హునార్ హాత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఈ రోజు పలువురు కళాకారులతో సంభాషించారు.

ఢిల్లీలోని హునార్ హాత్‌లో దివ్యంగ్ కళాకారుడిని ప్రధాని మోదీ కలిసినప్పుడు ...

February 19th, 06:10 pm

హునార్ హాత్ వంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా చాలా మంది ప్రతిభావంతులైన కళాకారులకు వేదికను ఇచ్చాయి. అటువంటి దివ్యంగ్ కళాకారిణిని ప్రధాని మోదీ కలుసుకుని, సంభాషించారు, ఆమె హునార్ హాత్‌లో భాగమైన తన అనుభవాన్ని పంచుకుంది.

‘హున‌ర్ హాట్’ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

February 19th, 03:52 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇక్క‌డ ఏర్పాటైన ‘హున‌ర్ హాట్’ను ఈ రోజు న సంద‌ర్శించారు. ‘హున‌ర్ హాట్’లో పాలుపంచుకొంటున్న దేశ‌వ్యాప్త పాక‌శాస్త్ర నిపుణులు, చేతివృత్తి ప‌నివారు మ‌రియు మాస్ట‌ర్ ఆర్జిజాన్ ల యొక్క దుకాణాల ను ఆయ‌న సంద‌ర్శించారు.