కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 12th, 04:01 pm

ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా హుబ్బళ్లి సందర్శించే అవకాశం నాకు లభించింది. హుబ్బళ్లిలోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులు రోడ్డు పక్కన నిలబడి నాపై చాలా ప్రేమ మరియు ఆశీర్వాదాలను కురిపించిన తీరు నేను ఎప్పటికీ మరచిపోలేను. గతంలో కర్ణాటకలోని పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం నాకు లభించింది. బెంగుళూరు నుండి బెలగావి వరకు, కలబురగి నుండి షిమోగా వరకు, మైసూరు నుండి తుమకూరు వరకు, కన్నడిగులు నిరంతరం నాకు అందించిన ప్రేమ, ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు నిజంగా అపారమైనవి. మీ అభిమానానికి రుణపడి ఉంటాను, కర్ణాటక ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఈ రుణం తీర్చుకుంటాను. కర్నాటకలోని ప్రతి వ్యక్తికి సంతృప్తికరమైన జీవితం ఉండేలా చూసుకునే దిశలో మేము కలిసి పని చేస్తున్నాము; ఇక్కడి యువత ముందుకు సాగుతున్నారు మరియు కొత్త ఉపాధి అవకాశాలను క్రమం తప్పకుండా పొందుతున్నారు మరియు సోదరీమణులు మరియు కుమార్తెలు మెరుగైన శక్తిని పొందుతున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కర్ణాటకలోని ప్రతి జిల్లా, ప్రతి గ్రామం మరియు ప్రతి పట్టణం సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఈ ధార్వాడ భూమిపై నేడు కొత్త అభివృద్ధి స్రవంతి ఆవిర్భవిస్తోంది. ఈ అభివృద్ధి ప్రవాహం హుబ్బల్లి, ధార్వాడ్‌తో పాటు మొత్తం కర్ణాటక భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది మరియు వికసిస్తుంది.

కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్ లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ధార్వాడ్ ఐఐటీ జాతికి అంకితం

March 12th, 04:00 pm

కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్ లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ ప్రాజెక్టులలో ధార్వాడ్ ఐఐటీ ప్రారంభోత్సవం కూడా ఉంది. దీని శంకుస్థాపన కూడా 2019 ఫిబ్రవరిలో ప్రధాని చేతుల మీదుగానే జరిగింది. అదే విధంగా 1507 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపొడవైన ప్లాట్ ఫామ్ గా గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకున్న సిద్ధ రూధ స్వామీజీ హుబ్బళ్ళి స్టేషన్ ను, హోసపేట – హుబ్బళ్ళి – తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణ, ఈ ప్రాంతంలో అనుసంధానత పెంచేలా హోసపేట స్టేషన్ స్థాయి పెంపు లాంటి కార్యక్రమాలు ప్రారంభించారు. హుబ్బళ్ళి -ధార్వాడ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. జయదేవ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు, ధార్వాడ్ బహుళ గ్రామ నీటి సరఫరా పథకానికి, తిప్పరిహళ్ళ వరద నష్ట నియంత్రణ పథకానికి కూడా ప్రధానిం శంకుస్థాపన చేశారు.

కర్నాటక లోని మండ్య ను మరియుహుబ్లీ-ధార వాడ ను మార్చి నెల 12వ తేదీ నాడు సందర్శించనున్న ప్రధానమంత్రి

March 10th, 01:14 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 12 వ తేదీ నాడు కర్నాటక ను సందర్శించనున్నారు. అక్కడ ఆయన సుమారు 16,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన కూడా చే యనున్నారు. మధ్యాహ్నం పూట ఇంచుమించు 12 గంటల వేళ కు ప్రధాన మంత్రి మండ్య లో ముఖ్యమైన కొన్ని రహదారి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత, దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వేళ కు ఆయన హబ్లీ-ధార వాడ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేస్తారు.

కర్నాటకలోని హుబ్బల్లిలో 26వ జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 12th, 04:30 pm

కర్ణాటకలోని ఈ ప్రాంతం సాంప్రదాయం, సంస్కృతి మరియు విజ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎందరో ప్రముఖులను జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించారు. ఈ ప్రాంతం దేశానికి ఎందరో గొప్ప సంగీతకారులను అందించింది. పండిట్ కుమార్ గంధర్వ, పండిట్ బసవరాజ్ రాజ్‌గురు, పండిట్ మల్లికార్జున్ మన్సూర్, భారతరత్న పండిట్ భీంసేన్ జోషి మరియు పండిత గంగూబాయి హంగల్ జీ లకు ఈరోజు హుబ్బళ్లి నేల నుండి నివాళులు అర్పిస్తున్నాను.

కర్ణాటకలోనిహుబ్బళ్లిలో 26వ జాతీయయువజనోత్సవాలకు ప్రధానమంత్రిశ్రీకారం

January 12th, 04:00 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌ళ్లిలో ఇవాళ 26వ జాతీయ యువ‌జన ఉత్స‌వాలను ప్రారంభించారు. స్వామి వివేకానంద ఆశయాలు, ప్రబోధాలు, సేవలను గౌరవిస్తూ ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈసారి “వికసిత యువతరం - వికసిత భారతం” ఇతివృత్తంగా వేడుకలను నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చే ఈ వేడుకలు అందరిలోనూ ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని నింపుతాయి.