పార్లమెంటుపై 2001లో దాడి సందర్భంగా అమరులైన వారికి ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

December 13th, 10:21 am

పార్లమెంటుపై 2001లో దాడి జరగగా ఆ దాడిని అడ్డుకొనే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు.

శ్రీ సుబ్రహ్మణ్య భారతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి

December 11th, 10:27 am

కవి, రచయిత శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్: శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

December 06th, 09:27 am

ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. సమానత్వ సాధన కోసం, మానవ ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడం కోసం డాక్టర్ అంబేద్కర్ అలుపెరుగక చేసిన పోరాటం తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

శిఖర సమానులు... డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ జీ భారతీయుల గౌరవం, సమానత్వాల దిశగా స్వేచ్ఛా భారతం కోసం జీవితాన్ని అంకితం చేశారు

November 22nd, 03:11 am

డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ జీ సమున్నత వ్యక్తిత్వం కలిగిన వారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాలనీ, భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం, సమానత్వంతో కూడిన జీవనం దక్కాలని తపిస్తూ, అందుకోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని అన్నారు. డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ శ్రద్ధాంజలి ఘటిస్తూ... డాక్టర్ మహతాబ్ ఆదర్శాలను సాకారం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

భారత ఆగమన స్మృతి చిహ్నాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

November 21st, 10:00 pm

జార్జ్ టౌన్ లోని స్మారకోద్యానవనంలో భారత ఆగమన స్మృతిచిహ్నాన్ని ప్రధానమంత్రి సందర్శించారు. ఆయన వెంట గయానా ప్రధానమంత్రి బ్రిగేడియర్ (విశ్రాంత) మార్క్ ఫిలిప్స్ ఉన్నారు. అక్కడ పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రికి టస్సా డోలు బృందం స్వాగతం పలికింది. స్మృతిచిహ్నం వద్ద నివాళి అర్పించిన ప్రధానమంత్రి.. గయానాలోని భారత సంతతికి చెందిన వారి పోరాటాన్నీ, త్యాగాలనూ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి విశేష కృషినీ గుర్తుచేసుకున్నారు. స్మృతిచిహ్నం వద్ద ఆయన బేల్ పత్ర మొక్క నాటారు.

మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

November 21st, 09:57 pm

గయానాలోని జార్జ్ టౌన్ లో ఉన్న చారిత్రక విహారోద్యానవనంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. బాపూ బోధించిన శాంతి, అహింసా విలువలను గుర్తుచేసుకున్న ఆయన.. అవి మానవాళికి ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయన్నారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా 1969లో ఆ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు.

శ్రీ బాలాసాహెబ్ థాకరే వర్ధంతి సందర్బంగా ప్రధానమంత్రి నివాళులు

November 17th, 01:22 pm

శ్రీ బాలాసాహెబ్ థాకరే జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ థాకరే జీ ఒక దార్శనికుడు, మహారాష్ట్ర అభివృద్ధి ని సాధించాలి అనే ఆశయ సాధనకు, మరాఠీ ప్రజానీకానికి సాధికారితను కల్పించడానికి ఆయన కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

November 15th, 11:04 pm

బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. ఉపేంద్రనాథ్ బ్రహ్మ జీవన యాత్ర అనేక మంది ప్రజలకు శక్తిని అందిస్తుందని ప్రధాని అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

November 14th, 08:52 am

మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భరంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నివాళి

October 08th, 02:52 pm

శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గొప్ప నాయకుడని కీర్తించారు. పేదల సంక్షేమానికి అంకితమయ్యారని, దృఢమైన, అభివృద్ధి చెందిన భారత్ కోసం కృషి చేశారని తెలిపారు.

సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు

October 05th, 02:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ఆయన దిక్సూచి అని మోదీ కొనియాడారు.

PM Modi pays homage at Gandhi statue in Kyiv

August 23rd, 03:25 pm

Prime Minister Modi paid homage to Mahatma Gandhi in Kyiv. The PM underscored the timeless relevance of Mahatma Gandhi’s message of peace in building a harmonious society. He noted that the path shown by him offered solutions to present day global challenges.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి

August 09th, 08:58 am

మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించిన ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు.

ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న కార్గిల్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

July 25th, 10:28 am

ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రేపు 2024 జులై 26న ఉదయం పూట సుమారు 9 గంటల 20 నిమిషాల వేళలో కార్గిల్ యుద్ధ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. కార్గిల్ యుద్ధం లో ప్రాణాలను ఆహుతి ఇచ్చిన అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. షింకున్ లా సొరంగ మార్గ ప్రాజెక్టులో భాగంగా తొలి పేలుడు ఘట్టాన్ని ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఆరంభించనున్నారు.

భారత రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా ఉన్న సందర్భాన్ని సంవిధాన్ హత్యా దివస్ గుర్తు కు తీసుకు వస్తుంది: ప్రధాన మంత్రి

July 12th, 05:06 pm

జూన్ 25వ తేదీ ని సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించడం వల్ల భారత రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ఉన్నప్పటి కాలాన్ని అది జ్ఞ‌ప్తి కి తెస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గాశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

July 04th, 09:44 am

స్వామి వివేకానంద కు ఆయన వర్థంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ఒడిశా పూర్వముఖ్య మంత్రి శ్రీ బీజూ పట్ నాయక్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని అర్పించినప్రధాన మంత్రి

March 05th, 09:44 am

ఒడిశా యొక్క పూర్వ ముఖ్య మంత్రి శ్రీ బీజూ పట్ నాయక్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

పుల్‌వామా లో ప్రాణసమర్పణం చేసిన వీర జవానుల కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

February 14th, 11:10 am

పుల్‌వామా లో 2019 వ సంవత్సరం లో ప్రాణసమర్పణం చేసినటువంటి వీర జవానుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

December 11th, 10:41 am

పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అమ్బేడ్‌కర్ కు ఆయన మహాపరినిర్వాణ్ దివస్ నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

December 06th, 08:19 am

డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అమ్బేబేడ్‌కర్ కు ఆయన మహాపరినిర్వాణ్ దివస్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.