'మన్ కీ బాత్' పట్ల ప్రజలు చూపుతున్న అభిమానం అపూర్వమైనది: ప్రధాని మోదీ

May 28th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్'లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు. లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. 'మన్ కీ బాత్' అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. 'మన్ కీ బాత్'పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. 'మన్ కీ బాత్' ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు 'మన్ కీ బాత్'పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. 'మన్ కీ బాత్'లో దేశం, దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 24th, 06:41 am

ఆస్ట్రేలియా పర్యటనలో నాకు, నా ప్రతినిధి బృందానికి ఇచ్చిన ఆతిథ్యం, గౌరవానికి ఆస్ట్రేలియా ప్రజలకు, ప్రధాని అల్బనీస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు, ప్రధాన మంత్రి (ఆస్ట్రేలియా) అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన రెండు నెలల్లోనే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి.

Prime Minister’s visit to the Hiroshima Peace Memorial Museum

May 21st, 07:58 am

Prime Minister Shri Narendra Modi joined other leaders at G-7 Summit in Hiroshima to visit the Peace Memorial Museum. Prime Minister signed the visitor’s book in the Museum. The leaders also paid floral tributes at the Cenotaph for the victims of the Atomic Bomb.

ఉక్రెయిన్ అధ్యక్షుడితో భారత ప్రధాని సమావేశం

May 20th, 07:57 pm

ఉక్రెయిన్ యుద్ధంవల్ల మొత్తం ప్రపంచంపై ప్రభావం పడిందని ప్రధానమంత్రి అన్నారు. అయితే ఇది తనకు రాజకీయ లేక ఆర్ధిక సమస్య కాదని, ఇది తనకు మానవతకు, మానవ విలువలకు సంబంధించిన సమస్య అని ప్రధాని అన్నారు.

క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ వ్యాఖ్యల తెలుగు అనువాదం

May 20th, 05:16 pm

ఈ రోజు నా స్నేహితులతో కలిసి ఈ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు భరోసా కల్పించడానికి క్వాడ్ గ్రూప్ ఒక ముఖ్యమైన వేదికగా స్థిరపడింది. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వాణిజ్యం, ఆవిష్కరణలు, వృద్ధికి చోదకశక్తి అనడంలో సందేహం లేదు. ఇండో-పసిఫిక్ భద్రత, విజయం ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికి చాలా ముఖ్యం. నిర్మాణాత్మక ఎజెండాతో, భాగస్వామ్య ప్రజాస్వామిక విలువల ఆధారంగా ముందుకు సాగుతున్నాం.

క్వాడ్ నేషన్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని

May 20th, 05:15 pm

మే 20, 2023న జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన మూడో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ (క్వాడ్ లీడర్స్ సమ్మిట్)లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ పాల్గొన్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో భారత ప్రధానమంత్రి సమావేశం

May 20th, 05:09 pm

జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి జపాన్ వెళ్లిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ హిరోషిమాలోని సమావేశ వేదిక వద్ద శనివారం గణతంత్ర ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మానుయేల్ మాక్రోన్ తో ద్వైపాక్షిక సమావేశం జరిపారు.

జపాన్ కు చెందిన ప్రముఖులతో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 20th, 12:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన పలువురు ప్రముఖులను, హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా కలుసుకున్నారు. ప్రధానమంత్రి కలుసుకున్న వారిలో డాక్టర్ తొమియో మిజోకమి, శ్రీమతి హిరోకో తకయామ తదితరులు ఉన్నారు. వారు తమ తమ రంగాలలో అద్భుత కృషి చేశారు.

హిరోషిమాలో మహాత్మాగాంధీ బస్ట్ సైజు కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,

May 20th, 08:12 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్లోని హిరోషిమాలో 2023 మే 20 వ తేదీన మహాత్మాగాంధీ ఛాతీ సైజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

PM Modi arrives in Hiroshima, Japan

May 19th, 05:23 pm

Prime Minister Narendra Modi arrived in Hiroshima, Japan. He will attend the G7 Summit as well hold bilateral meetings with PM Kishida of Japan and other world leaders.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ,జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన

March 20th, 12:30 pm

ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న జపాన్ ప్రధానమంత్రి కిషిడా కు, ఆయన వెంట వచ్చిన ప్రతినిధివర్గానికి ముందుగా సాదర స్వాగతం. గత ఏడాది కాలంలో జపాన్ ప్రధానితో నేను చాలాసార్లు సమావేశమయ్యాము. నేను ఆయనను కలసిన ప్రతిసారి ఆయనలో సకారాత్మక వైఖరి, ఇండియా - జపాన్ సంబంధాలపట్ల నిబద్ధత నాకు కనిపించాయి. అందువల్ల, ఈ రోజు ఆయన రాక మన రెండు దేశాల మధ్య సహకారం నిలబెట్టుకోవడాని, అదే ఉరవడిలో కొనసాగడానికి ఎంతో ఉపయోగపడగలదు.

PM pays homage to all those who lost their lives in Hiroshima bombings, during the World War-II

August 06th, 10:37 am