సెప్టెంబర్ 29వ మరియు 30వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్నప్రధాన మంత్రి
September 27th, 12:34 pm
సెప్టెంబర్ 29వ మరియు 30వ తేదీల లో గుజరాత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. సూరత్ లో 3,400 కోట్ల రూపాయల కు పైగా విలువైన వివిధ ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 29వ తేదీ నాడు ఇంచుమించు ఉదయం 11 గంటల వేళ లో ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని ప్రజల కు అంకితం కూడా చేస్తారు. ఆ తరువాత ప్రధాన మంత్రి భావ్ నగర్ కు బయలుదేరి వెళతారు. అక్కడ మధ్యాహ్నం పూట సుమారు 2 గంటల కు ఆయన 5,200 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్ని కార్యక్రమాల ను ప్రారంభిస్తారు. ముప్ఫై ఆరో జాతీయ క్రీడల ను రాత్రి దాదాపు 7 గంటల వేళ లో అహమదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియమ్ లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. రాత్రి దాదాపు 9 గంటల వేళ లో అహమదాబాద్ లోని జిఎండిసి మైదానం లో నవరాత్రి ఉత్సవాల లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు.No place for corruption in 'Nawa Punjab', law and order will prevail: PM Modi
February 15th, 11:46 am
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”PM Modi campaigns in Punjab’s Jalandhar
February 14th, 04:37 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”మాకు, చరిత్ర మరియు విశ్వాసం యొక్క సారాంశం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్: ప్రధాని మోదీ
August 20th, 11:01 am
గుజరాత్ లోని సోమనాథ్ లో పిఎం మోడీ బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. గౌరవనీయమైన దేవాలయ చరిత్రను ప్రతిబింబిస్తూ, ప్రతి దాడి తరువాత దేవాలయం ఎలా పునరావృతమవుతుందో మరియు ఆలయం ఎలా పుంజుకుంటుందో ప్రధాని గుర్తు చేశారు. ఇది ఒక చిహ్నం సత్యాన్ని అబద్ధం ద్వారా ఓడించలేము మరియు విశ్వాసాన్ని భీభత్సం ద్వారా అణిచివేయలేము అనే నమ్మకం అని ప్రధాని అన్నారు.సోమనాథ్ లో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
August 20th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్ లోని సోమనాథ్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. సోమనాథ్ విహారయాత్రా కేంద్రం, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ లో పునర్నిర్మించిన దేవాలయం ఆ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ పార్వతి దేవాలయానికి శంకుస్థాపన చేశారు. శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, కేంద్ర హోం మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గుజరాత్ లో పలు ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
July 16th, 04:05 pm
మంత్రి మండలిలో నా సహచరులు, గాంధీనగర్ ఎంపి శ్రీ అమిత్ షా జీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ జీ భాయ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ దర్శన జార్డోష్ జీ, గుజరాత్ ప్రభుత్వ ఇతర మంత్రులు, పార్లమెంటులో నా సహచరులు మరియు గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ ఇతర ఎంపిలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదర సోదరీమణులు, మీ అందరికీ శుభాకాంక్షలుగుజరాత్ లో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 16th, 04:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.గుజరాత్ లో జూలై 16న పలు ప్రాజెక్టుల ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; వాటి ని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు
July 14th, 06:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైల్వేల కు చెందిన అనేక కీలక ప్రాజెక్టుల ను 2021 జూలై 16న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా గుజరాత్ లో ప్రారంభించనున్నారు. అనేక పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయనున్నారు కూడా. ఈ కార్యక్రమం లో భాగం గా గుజరాత్ లోని సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్-రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.